తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. నోటిఫికేషన్లతో పాటు ఉచిత కోచింగ్ ఇస్తామని కూడా తెలిపింది. అయితే గత నోటిఫికేషన్ల నుంచి తెలంగాణ సర్కార్ ఉచిత కోచింగ్ ఇస్తూ వస్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో ప్రకటనతో అభ్యర్ధులకు తీపికబురును అందించింది. మీడియాతో మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్ రూ.5 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఉచిత కోచింగ్ కు ఈ నెల 16 వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. […]