పవన్ కల్యాణ్ సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. అదే పవన్ అభిమాని డైరెక్ట్ చేస్తున్నాడంటే ఇంక ఫ్యాన్స్ కి పూనకాలే. ఇప్పటికే హరీశ్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాతో తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ గా పవన్ తో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది.
రాఘవ లారెన్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్.. ప్రస్తుతం హీరోగా, దర్శకుడిగా తన సత్తా చాటుతున్నాడు. ఎక్కువగా హారర్ కామెడీ జానర్ లో ముని, కాంచన, కాంచన 2, కాంచన 3 సినిమాలు చేసి అటు హీరోగా, ఇటు దర్శకుడిగా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. లారెన్స్ హీరోగా ఇప్పుడు చాలా సినిమాలు లైనప్ చేశాడు. కాంచన 3 తర్వాత మళ్లీ లారెన్స్ నుండి కొత్త సినిమా రాలేదు. […]
RRR చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలుసు. అలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్.. కొరటాల శివతో చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్టేడ్ వచ్చింది. ఈ మూవీకి సంబంధించి మోషన్ పోస్టర్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ను చూసిన తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు. రిలీజ్ చేసింది మోషన్ […]
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమంత లీడ్ రోల్ లో తెరకెక్కిన యశోధ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రానే వచ్చేసింది. ఈ గ్లింప్స్ చూశాక సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయనే చెప్పాలి. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో తన నటనపై అంచనాలు పెంచేస్తోంది. గ్లింప్స్ విషయానికి వస్తే.. యశోధ ఒక్కసారిగా నిద్రలేచి చూస్తుంది. ఆమె ఎక్కడో దూరంగా జైలులాంటి పెద్ద కట్టడంలో ఉంటుంది. ఆమె ఎక్కడ ఉన్నదీ ఆమెకు కూడా తెలియదు. […]
రాధే శ్యామ్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, డైరెక్టర్ మారుతీతో కామెడీ ఎంటర్టైనర్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. రాధే శ్యామ్ ప్లాప్ ప్రభావం ప్రభాస్ పై ఇసుమంత కూడా పడలేదని అంటున్నాయి సినీవర్గాలు. ఎందుకంటే.. రాధే శ్యామ్ రిలీజ్ ముందునుండే అందరి చూపు తదుపరి సినిమా సలార్ పై పడింది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా అన్నప్పుడే […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే.. ఇప్పటివరకు పోస్టర్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిన లైగర్ టీమ్, ఈసారి మాసివ్ గ్లింప్స్ రిలీజ్ చేసి అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ యాభై సెకండ్ల గ్లింప్స్ లో పూరీ […]