ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్‌లో ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండో డోసుకు వచ్చిన వారికి తొలి డోసులో వేసిన వ్యాక్సిన్‌కు బదులు వేరేది అందించారు. తొలుత కొవిషీల్డ్ తీసుకున్న 20మందికి రెండు డోసులో కొవాగ్జిన్ ఇచ్చారు. తర్వాత పొరపాటును గుర్తించిన అధికారులు అలా తీసుకున్న వారిని ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. వారిలో ఇప్పటివరకు ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు కనిపించలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉంటే, వేర్వేరు వ్యాక్సిన్ డోసులు తీసుకోవడంపై అంతర్జాతీయంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా, ఫైజర్ […]
కరోనా కల్లోలం నుండి బయట పడటానికి ప్రపంచదేశాలు అన్నీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ ప్రయత్నాల్లో అందరికీ ఆశాజనకమైన మార్గం కనిపించింది వ్యాక్సినేషన్ ఒక్కటే. ఈ విషయంలో అమెరికా, యూకే వంటి దేశాలు కాస్త త్వరగా చర్యలు తీసుకుని అక్కడ వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతం చేశాయి. దీనితో.. ఇప్పుడు ఆయా దేశాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. కానీ.., మన దేశంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర […]