మనిషికి దేవుడు ప్రాణం ఇస్తే.. ఆ ప్రాణానికి ఏదైనా అపాయం జరిగిదే వైద్యం చేసి మళ్లీ ప్రాణాలు రక్షించే గొప్ప వృత్తి వైద్య వృత్తి. అందుకే వైద్యుడిని దేవుడితో పోలుస్తుంటారు. డాక్టర్ కావడం అనేది సామాన్య విషయం కాదు.. దానికోసం ఎంతో కష్టపడాలి. అందులో సక్సెస్ సాధించేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఈ మద్య కొంత మంది కంపౌండర్లు, చిన్న చిన్న మూలికా వైద్యం చేసేవారు సైతం దొంగ సర్టిఫికెట్స్ తో డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. […]
దేశంలో నకిలీ వైద్యులు బాగోతాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. డాక్టర్ డిగ్రీ కాదు కదా కనీసం డిగ్రీ కూడా లేని వాళ్లు వైద్యులుగా చెలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జనాలు కూడా వీరిని అమాయకంగా నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అనారోగ్య సమస్యలతో వచ్చిన జనాలకు నకిలీ వైద్యుడు ఒకరు ఏకంగా పశువుల ఇంజెక్షన్ ఇచ్చాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. […]