నమ్మి ఇల్లు అద్దెకు ఇస్తే.. ఖాళీ చేయకుండా.. ఇప్పుడు ఏకంగా ఇంటి యజమానినే బయటకు గెంటేశాడు ఓ వ్యక్తి. తనకు న్యాయం చేయాలంటూ ఆ వృద్ధురాలు అధికారులను ఆశ్రయించింది. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. రుద్రంపేట గ్రామానికి చెందిన జమ్మటపాటి శాంతమ్మకు ఊరిలోని సర్వే నెంబర్ 82–3బీలోని 3 సెంట్లలో రేకుల షెడ్డు ఉంది. 2002లో సూర్యనారాయణరెడ్డి అనే వ్యక్తి కుటుంబంతో కలసి ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఇటీవల సూర్యనారాయణరెడ్డి తీరుపై […]
భారతీయ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన వ్యాపారస్థుడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో ఎదురు దెబ్బతగిలింది. విజయ్ మాల్యా భారత్ నుంచి పారిపోయి లండన్‌లోని రిజెంట్ పార్క్‌లో తన సొంత ఇంట్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే మాల్యా నివాసముంటున్న ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు స్విస్ బ్యాంక్ అయిన “యూబీఎస్” కు న్యాయస్థానం మార్గం సుగమం చేసింది. అప్పులు చెల్లించడంలో జాప్యం కారణంగా.. మాల్యాతోపాటు ఆయన కుటుంబసభ్యులను ఇంటినుంచి […]