E-Crop: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆ బాటలో ఈ-క్రాప్ నమోదు చేరింది. ఈ-క్రాప్ నమోదుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ-క్రాప్ వల్ల కలిగే లాభాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్రం ఏపీపై ప్రశంసలు కురిపించింది. జాతీయ స్థాయిలో ఈ-క్రాప్ అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇది వరకే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న […]