పెళ్లైన నెలకు ఓ కొత్త పెళ్లి కూతురు దారుణానికి పాల్పడింది. ప్రియుడితోనే ఉండాలని భావించింది. కానీ తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేయడంతో చివరికి కట్టుకున్న భర్తనే హతమర్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా తోగుట మండలం గుడికందుల గ్రామం. శ్యామల (19) అనే యువతి ఇదే ప్రాంతానికి చెందిన శివకుమార్ అనే యువకుడితో పాటు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంది. […]