పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించినట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పలు రాష్ట్రాల గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమితులైనట్లు ప్రకటన విడుదలైంది.
బుధవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయాని సందర్శించారు. అయితే ద్రౌపది ముర్ము పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. రామప్పలో ఏర్పాటు చేసిన లైవ్ ఎల్ఈడీ స్క్రీన్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ క్రమంలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పొగను అదుపు చేశారు. ఈ షార్ట్ సర్క్యూట్ ఘటనతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి […]
దేశ ప్రధమ పౌరురాలు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము.. పోరంకిలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ.. సీఎం జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి పథంలో సాగుతోందని అన్నారు. […]
Draupadi Murmu: 15వ భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులో సీజేఐ జస్టిస్ రమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్‌లు హాజరయ్యారు. ప్రమాణం స్వీకారం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. కాగా, అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ద్రౌపది ముర్ము 25 ఏళ్ల కెరీర్ లో.. రాజకీయాల్లో కిందిస్థాయి పదవి అయిన కౌన్సిలర్ నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి […]
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. అలాగే.. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము నిలిచారు. ఇంతకుముందు ప్రతిభ పాటిల్.. భారత మొదటి మహిళా రాష్ట్రపతిగా పనిచేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ద్రౌపది ముర్ముకు 68.87 శాతం(5,77,777) ఓట్లు, యశ్వంత్ […]
దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పార్లమెంట్‌లో 99.18 శాతం ఓటింగ్ నమోదైనట్లు చీఫ్ రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ తెలిపారు. పార్లమెంటులో ఓటు వేసేందుకు భారత ఎన్నికల కమిషనర్ అనుమతించిన 736 మంది ఓటర్లలో (727 మంది ఎంపీలు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు) 730 మంది (721 ఎంపీలు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు) ఓటు వేసినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ […]
దేశ ప్రథమ పౌరుడు, 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ప్రాంగణంలో ప్రారంభమైన ఓటింగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సహా.. లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించకుంటున్నారు. ఇక ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ తరఫున ద్రౌపది ముర్ము.. బరిలో నిలవగా.. విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా పోటీలో నిలిచారు. తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. తెలంగాణకు చెందిన శాసనసభ్యులు […]
దేశ ప్రథమ పౌరుడు, 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ప్రాంగణం, అసెంబ్లీ ఆవరణలో ప్రారంభమైన ఓటింగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సహా.. లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించకుంటున్నారు. ఇక ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ తరఫున ద్రౌపది ముర్ము.. బరిలో నిలవగా.. విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా పోటీలో నిలిచారు. అయితే రాష్టప్రతి ఎన్నిక.. మిగతా వాటితో పోలిస్తే భిన్నంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ […]
RGV: కొద్దికాలంగా దేశ రాజకీయాలలో రాష్ట్రపతి అభ్యర్థుల గురించి నిరంతర చర్చలు జరుగుతున్న విషయం విదితమే. ఈ తరుణంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ముంబై కోర్టులో కేసు నమోదైంది. సుభాష్ రాజోరా అనే వ్యక్తి బీజేపీ కార్యకర్తనని చెబుతూ ముంబైలోని ఓ కోర్టులో వర్మపై ఈ కేసు వేశారు. సెక్షన్లు 499, 500 (పరువు నష్టం), 504 (ఉద్దేశ పూర్వకంగా అవమానించడం), 506 […]
దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. ఈ క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించింది. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా మీద ద్రౌపది ముర్ము భారీ మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఓ గిరిజన మహిళ ఇంతటి అత్తున్నత స్థానానికి ఎన్నిక కావడంతో దేశవ్యాప్తంగా గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ద్రౌపది ముర్ము పేరు ట్రాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. […]