నగరంలో తొలిసారి ఓ చైన్ స్నాచర్ మూడు కమిషనరేట్ల పోలీసులకు సవాల్ విసిరాడు. బుధవారం సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆరు నేరాలు చేశాడు. ఐదు చోట్ల తన ప్రయత్నానికి ఫలితం రాగా.. మరో ప్రాంతంలో ప్రయత్నం ఫలించలేదు. పేట్‌బషీరాబాద్, మారేడ్‌పల్లి, తుకారాంగేట్, మేడిపల్లి ఠాణాల పరిధిలో కేవలం ఐదున్నర గంటల వ్యవధిలోనే ఈ ఉదంతాలు చోటుచేసుకున్నాయి. జర్కిన్ వేసుకున్న యువకుడు తలకు టోపీ, ముఖానికి మాస్క్ ధరించి.. యాక్టివా వాహనంపై తిరుగుతూ ఈ నేరాలు […]
కూకట్‌పల్లి భగత్‌సింగ్ నగర్‌లో ఇంజినీరింగ్ చేసిన ప్రశాంత్‌కు 2010లో బెంగళూరులో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో అక్కడ మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి స్వప్నిక పాండే పరిచయమైంది. ఈ క్రమంలో ప్రశాంత్ ఆమెను ప్రేమించాడు. మూడేళ్లు కలసి పనిచేసినా ఆ మాట ఆమెకు చెప్పలేకపోయాడు. 2013లో ఉద్యోగ రీత్యా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినా ఆమె వద్దకు వెళ్లాలని ప్రయత్నించాడు. ఈ లోపు యువతి బెంగళూరు నుంచి వెళ్లిపోవడంతో నేరుగా మధ్యప్రదేశ్‌లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ప్రేమ […]
ట్రాఫిక్ సహా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం స్టార్ హీరో, హీరోయిన్ల సినిమా పోస్టర్, ఫేమస్ డైలాగులను వాడేస్తారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ట్విటర్ వేదికగా సినిమా నటీనటులతో మీమ్స్ తరహాలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. బ్రహ్మానందంతో రూపొందించిన మీమ్స్ నెటిజన్లను చాలా ఆకట్టుకున్నాయి. కరోనా వేళ మాస్కు ప్రాధాన్యాన్ని చాటేందుకు కూడా పోలీసులు […]