టీమిండియా మాజీ దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనికి చెందిన క్రికెట్ అకాడమీని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం హైదరాబాద్‌లో తమ కార్యకలపాలను ప్రారంభించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌తో పాటు పల్లవి విద్యా సంస్థలతో ధోని అకాడమీ ఒప్పందం కుదుర్చుకుంది. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో శుక్రవారం జరిగిన మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అకాడమీ(ఎంసీడీసీఏ) ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి సమక్షంలోనే […]