కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతిఒక్కరు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డీహెచ్ శ్రీనివాస్ రావు సూచించారు. డీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కొవిడ్ వ్యాప్తి పూర్తిగా పోలేదని.. రానున్న మూడు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందన్నారు. అయితే పక్క రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. ‘రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని […]
కరోనా కట్టడికి వ్యాక్సినే కీలక ఆయుధం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. టీకా రెండు డోసులు తీసుకుంటే.. కరోనా వచ్చినా మరణాలు ఎక్కువగా సంభవించవని ప్రచారం చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా శరవేగంగా వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్ పై ఇప్పటికి చాలామందికి పలు అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఔరంగాబాద్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల తన బిడ్డ […]
న్యూ ఢిల్లీ- కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదలడం లేదు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తరువాత కాస్త ఊపిరి పీల్చుకుంటున్న మానవాళిని మళ్లీ ధర్డ్ వేవ్ ముంచెత్తుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా వైరస్ జంతువులను వదిలిపెట్టడం లేదు. తాజాగా చెన్నైలోని ఓ జూలో రెండు సింహాలు కరోనా సోకి మృత్యువాతపడ్డాయి. ఈ నేపథ్యంలో జంతువులకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు హరియాణాలోని […]
కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో ప్రపంచ మానవాళి జీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పుడు థర్డ్ వేవ్ తన ప్రతాపం చూపిస్తుంది. అయినా కూడా చాలా మంది కోవిడ్ నియంత్రణకు వ్యాక్సిన్ వేసుకునేందుకు భయపడుతున్నారు. కానీ ఒక చోట మాత్రం కరోనా వ్యాక్సిన్ మాత్రం అద్భుతం చేసింది. పక్షవాతంతో మంచానికే పరిమితం అయిన వ్యక్తి జీవితంలో వెలుగు నింపింది. అలాగే అతని మాటలు కూడా తెప్పించింది. జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లాలోని పెతర్వార్ మండలం సల్గాడి గ్రామంలో దులార్ చంద్ […]
కరోనా మహమ్మారి అంతకంతకీ విజృభిస్తున్న విషయం తెలిసిందే. రోజుల వ్వవధిలోనే వందల్లో ఉన్న కేసులు.. వేలల్లోకి వచ్చేశాయి. ఏ మాత్రం అశ్రద్ధగా ఉండొద్దని WHO హెచ్చరిస్తోంది. కేంద్రం కూడా కట్టడి చర్యలు మొదలు పెట్టింది. రాష్ట్రాలు సైతం కరోనా కట్టడికి ఆంక్షలను కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడికి బూస్టర్ డోసు టీకా పంపిణీ కూడా మొదలు పెట్టేశారు. జనవరి 10 నుంచి బూస్టర్ డోసు పంపిణీ మొదలు పెట్టారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం […]
న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు, బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. భారత్ లో ఒమిక్రాన్ వేరియింట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఒమిక్రాన్ మెల్ల మెల్లగా వ్యాప్తి చెందుతోందని మోదీ అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ తో చాలా ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ప్రధాని చెప్పారు. ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా […]
సాధారణంగా కరోనా నియంత్రణకు మనం రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటున్నాం. కానీ ఒక వ్యక్తి ఏకంగా ఎనిమిది డోసులు తీసుకున్నాడు. అది కూడా నకిలీ ఐడీ కార్డులు చూపించి మరీ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. విచిత్రం ఏమిటంటే.. వ్యాక్సిన్ తీసుకునేందుకు భయపడుతున్న వారి పేరుపై కూడా ఇతనే వ్యాక్సిన్ వేయించుకున్నాడు. అందుకుగాను.. వారి నుంచి డబ్బులు కూడా తీసుకోవడం విశేషం. ఈ తతంగం అంతా జరిగింది బెల్జియం దేశంలో. తన వ్యాక్సిన్‌తో పాటు వ్యాక్సిన్ తీసుకోని వారి డోసులు […]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఈ మద్య కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజల్లో భయాందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం కరోనా చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల్లో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా పరిశోధనలు జరుగుతున్నాయని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా వెల్లడించారు. ఓ సదస్సులో మాట్లాడిన ఆయన పిల్లలకు కొవిడ్ […]
ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా అవసరం. దాదాపు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ డోసులు రెండు మాత్రమే తీసుకోవాలి. కానీ ఇటీవల న్యూజిలాండ్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఒకే రోజులో 10 డోసులు తీసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇది నిజమా కాదా అనే సందేహంతో.. న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి ధర్యాప్తు ప్రారంభించింది. సదరు వ్యక్తి ఎందుకు పదిసార్లు వాక్సిన్ వేయించుకున్నాడో ఇంకా తెలియలేదు. కానీ […]
అమరావతి- దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. మరణాల సంఖ్య కూడా తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా నియంత్రణలోకి వచ్చింది. మరోవైపు భారత్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో సుమారు 28 కోట్ల మందికి కరోనా టీకా వేశారు. ఇక కొవిడ్ వ్యాక్సినేషన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందు దూసుకుపోతోంది. దశంలోనే రికార్డు స్థాయిలో కరోనా టీకా కార్యక్రమాన్ని అమలుచేస్తోంది […]