దేశం ఎప్పుడూ చూడని కష్టాలని ఇప్పుడు చూస్తోంది. దీనికి కారణం కరోనా. ఇప్పటికే దేశంలోని అన్నీ రంగాలు దీని దెబ్బకి కుదేలయ్యాయి. మరో వైపు ప్రజల ప్రాణాలకి సైతం గ్యారంటీ లేకుండా పోయింది. దేశంలో వైద్య రంగం కూడా చేతులు ఎత్తేయడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. మరి సెకండ్ వేవ్ కే ఇంత దారుణంగా ఉంటే.., థర్డ్ వేవ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ ప్రశ్న అందరికీ చెమటలు పట్టిస్తోంది. థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుంది?ఎలా వస్తుందో అనే […]
కరోనా రెండో వేవ్ విజృంభిస్తోన్న తరుణంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు. ఇందుకు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు తగిన చర్యలు పాటిస్తున్నారు. పెద్దవారి మాదిరిగా చిన్నపిల్లలకు వైరస్, సూక్ష్మజీవులపై పెద్దగా అవగాహన ఉండదు. ఫలితంగా పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారిలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. అన్ని రకాల పోషకాలు ఉండే సమతూలాహారాన్ని ఇవ్వాలి. సంపూర్ణ పోషకాలుండే ఆహారాల జాబితాలో గుడ్డు ముందు వరుసలో ఉంటుంది. […]
కరోనా పరీక్షల్లో జరుగుతున్న దోపిడీ. పలు ప్రైవేటు వైద్యశాలలు, ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక పక్క మహమ్మారి బారిన పడి అల్లాడుతున్న పేషెంట్లు మరో దిక్కులేక వారు అడిగినంత సమర్పించుకుని రిపోర్టులతో బయట పడుతున్నారు. ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు లేకపోవడంతోనే జనం ప్రైవేటుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు ఉన్నదే దోచుకునేందుకు అన్నచందంగా తయారయ్యాయి. కరోనా నిర్ధరణ పరీక్షల కోసం వెళ్తే […]
లండన్ (ఇంటర్నేషనల్ డెస్క్)- కరోనా.. ఇప్పుడు ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. గత యేడాది దాడి ప్రారంభించిన ఈ మహమ్మారి ఇంకా మముషులపై దండయాత్ర చేస్తూనే ఉంది. ఎవరు తుమ్మినా, దగ్గినా సరే ముందు వారికి వైరస్ సోకిందనే అనుమానమే వస్తోంది. ఇలాంటి సమయంలో ఓ 23 ఏళ్ల యువకుడు తనకు కరోనా వైరస్ ఎక్కించాలని కోరుతున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షరాల నిజం. ఇలా కరోనా వైరస్‌ను స్వయంగా ఎక్కించుకుంటున్న ఈ […]