మహరాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం అహ్మద్‌నగర్ జిల్లా కొవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. కరోనా వార్డులోని ఐసీయూలో మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఆ అగ్నిప్రమాదంలో ఆరుగురు కొవిడ్ రోగులు సజీవదహనమయ్యారు. ప్రమాదంలో మరో 11 మంది రోగులు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయానికి ఐసీయూలో మొత్తం 17 మంది రోగులకు చికిత్స చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించినట్లు […]
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలిస్తున్నట్లు వాస్తవ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైరస్‌బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే వార్తలు మరింత రిలీఫ్ ఇస్తున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన ఆస్ట్రాజెనికా (కొవిషీల్డ్) కరోనా టీకాను సింగిల్ డోస్ వేసుకున్నా, వైరస్ తో చనిపోయే ప్రమాదం 80 శాతం వరకూ తగ్గుతుందని ‘పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ)’ సంస్థ వెల్లడించింది. అలాగే ఫైజర్ బయో ఎన్ […]
కరోనా సంక్షోభం అనేక కుటుంబాల్లో సృష్టిస్తున్న విలయం అంతాకాదు ఇంతాకాదు. శాశ్వతంగా తమకు దూరమైన ఆప్తులకు కనీసం కడసారి వీడ్కోలు చెప్పేందుకు కూడా వీలులేక అల్లాడిపోతున్నాయి.ఈ క్రమంలో రాజస్థాన్‌లో షాకింగ్ ఉదంతం ఒకటి కలకలం రేపింది. కరోనాతో మృతి చెందిన తండ్రి మరణాన్ని తట్టుకోలేని ఓ కుమార్తె ఆయన మండుతున్న చితిపై దూకేసింది. ఇటీవలే తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుమార్తె తండ్రి చితిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన అక్కడున్నవాళ్ళందర్నీ కంట తడిపెట్టించింది. రాజస్థాన్ బార్మెర్ జిల్లా […]