గత కొన్ని రోజులుగా బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత క్రీడాకారులు వరుస విజయాలు అందుకుంటూ.. బంగారు పతకాలు సాధిస్తున్నారు. తాజాగా భారత పారా టేబుల్ టెన్నిస్ గుజరాత్‌కు చెందిన భవినా పటేల్ బంగారు పతకం సాధించింది. శనివారం జరిగిన పారా టేబుల్ టెన్నిస్ సింగిల్స్ క్లాస్ 3-5 కేటగిరీలో స్వర్ణం గెలుచుకొని చరిత్ర సృష్టించింది. పారా టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఫైనల్స్‌లో నైజీరియాకు చెందిన క్రిస్టియానాపై 3-0తో భవినా పటేల్ గెలుపొందింది. 12-10 […]
కామన్‌వెల్త్‌లో మొదటిసారిగా జరుగుతున్న మహిళల క్రికెట్‌లో భారత క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. టీమిండియా పైనల్‌కు చేరుకోవడం పట్ల యావత్ దేశం గర్విస్తుంది. సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ను 160/6 స్కోరుకే పరిమితం చేసిన భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. దీంతో పతకం ఖాయం చేసుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో స్కివెర్ 41, వ్యాట్ 35, జోన్స్ 31, […]
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్ లో భారత్ ఆటగాళ్ళు మూడు స్వర్ణాలను గెలుచుకొని అద్భుతం సృష్టించారు. నాలుగేళ్ల కిందట అయిదు స్వర్ణాలు సహా పన్నెండు పతకాలు కొల్లగొట్టారు మన కుస్తీ యోధులు. ఈసారి కూడా భారత రెజ్లర్లు అదే జోరు కొనసాగిస్తున్నారు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో శుక్రవారం ఆరు పతకాలతో అదరగొట్టారు. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్ స్వర్ణ పతకాలతో సాధించగా… అన్షు […]