సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే అంత తేలిక కాదు. కోడింగ్, ప్రోగ్రామింగ్ చాలానే తలనొప్పులు ఉంటాయి. అవేమీ రాని వాళ్లు యాప్ తయారు చేయడం అనేది కలే అవుతుంది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఎలాంటి కోడింగ్ ఎక్స్ పీరియన్స్ లేకుండా కూడా యాప్స్ క్రియేట్ చేయచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
భారతీయుల మేధాశక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూర్వకాలం నుంచి నేటికాలం వరకు ఎందరో భారతీయుల తమ మేధాశక్తితో ప్రపంచం ముందు భారతదేశానికి గుర్తింపు తెస్తున్నారు. టెక్ నైపుణ్య విషయంలో భారతీయుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచస్థాయి ఐటీ సంస్థల్లో మనవాళ్లదే హవా. సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల వంటివారు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర కు చెందిన వేదాంత్ కాటే అనే కుర్రాడు అమెరికా చెందిన ఓ సంస్థ నిర్వహించిన […]