అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ. సిగరెట్లను క్యారీ చేసినంత ఈజీగా గన్స్ ని క్యారీ చేస్తుంటారు. అక్కడ పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం అంతా స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా కాలేజ్ క్యాంపస్ లలో గన్ లు, వాటిని పట్టుకున్న చేతులు.. వాటి నుంచి వచ్చే బుల్లెట్లు.. బుల్లెట్ల కారణంగా మన ట్లేగ వాళ్ళకి తగిలిన గాయాలు దర్శనమిస్తుంటాయి. గత కొంతకాలంగా మన వాళ్ళ మీద దాడులు చేస్తూనే ఉన్నా గానీ అక్కడి యంత్రాంగం మాత్రం దీన్ని కంట్రోల్ […]
హిందూ సంప్రదాయంలో పెళ్లంటే ఎన్ని మధురానుభూతులు ఉంటాయో అందరకి తెలుసు. తాళాలు, తప్పట్లు, పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, బంధువుల సందడి, మూడు ముళ్లు ఇది భారతీయ హిందూ సంప్రదాయ పెళ్లి. ఇల్లంతా పచ్చటి తోరణాలు, చుట్టాల ముచ్చట్లు, ఆడవాళ్ల ఆభరణాలు, పట్టుచీరల సోయగాలు, పిల్లల కోలాహలంతో.. పెళ్లి ఇంటి సందడే సందడి. ఇక మూడు ముళ్లతో ఒక్కటయ్యే వధూవరుల జంట సంగతి చెప్పనక్కరలేదు. చిలిపి ఆలోచనలు, సిగ్గు తెరలు, ముసిముసి నవ్వులు, అందమైన అలంకరణలో మెరిసిపోతుంటారు. […]
ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. చికాగోలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. చికాగోలో ఆదివారం రోడ్డు పై తెల్లవారుజామున 5:00 గంటల […]
మనిషికి గుండె ఎక్కడుంటుంది అని విద్యార్ధుల్ని మాస్టారు ప్రశ్నిస్తే టక్కున ఎడమ వైపు అని తడుముకోకుండా చెప్పేస్తారు ..ఇది సృష్టిలో వాస్తవంగా అందరికీ తెలుసున్నవిషయం!ఇదొక ప్రశ్నా’..అనిపిస్తుంది.హృదయం ఎక్కడున్నాది..అని ప్రశ్నించినా వారిని అదోలా చూస్తాం.కానీ..అమెరికాకు చెందిన19 ఏళ్ల క్లెయిర్ మాక్ని అడిగితే మాత్రం తన గుండె కుడి వైపు ఉందని తడుముకోకుండా చెప్పేస్తుంది.సమాధానం విన్నమనకి ఆశ్చర్యం కలిగించక మానదు.సృష్టికి విరుద్ధంగా ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం! కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని […]
అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ (సీపీఎస్) బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తరగతి నుంచి ఆపై అన్ని తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో కండోమ్‌లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టబోతోంది. ఈ నిబంధన బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు ఈ విద్యా సంవత్సరం నుంచే వర్తించేటట్లు అన్ని విద్యాసంస్థలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది. 2020 డిసెంబర్లోనే సీపీఎస్ బోర్డు ఈ విధానాన్ని రూపొందించింది. సెక్స్ ఎడ్యుకేషన్లో ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నది బోర్డు అభిప్రాయం. ఎలిమెంటరీ […]