ఈ రోజుల్లో చాలామంది యువకులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడి వారి అవసరాలను తీర్చుకునేందుకు ఎంతటి తప్పిదాలనైనా చేస్తున్నారు. మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ముఖ్యంగా ఒంటరిగా కనబడిన వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఆపై దొరికినంత దోచుకుంటున్నారు.
పంచదారలో అయితే ఏకంగా థర్మాకోల్ షీట్స్ ని పొడి చేసి కలుపుతున్నారు. కొందరు రసాయనాలను కలుపుతున్నారు. టీ పొడి, కారప్పొడి వంటి వాటిలో ఇటుకల పొడి కలిపి అమ్మేస్తున్నారు. మరి ఈ మోసాన్ని ఎలా గుర్తించాలి?
మోసం చేసే వాడిదే కాదూ.. మోసపోయే వాడిదే తప్పు అన్న చందంగా తయారయ్యింది నేటి తీరు. ఇక అమ్మాయిలతే కిలేడీలుగా మారిపోతున్నారు. ప్రేమ పేరుతో మోసం చేయడంలో అబ్బాయిలను ఏ మాత్రం తీసిపోవడం లేదు.
కొంతమంది పెట్రోల్ బంకు సిబ్బంది కస్టమర్లను మోసం చేస్తుంటారు. రకరకాల ట్రిక్కులను ప్లే చేసి మోసాలకు పాల్పడుతుంటారు. అసలు పెట్రోల్ పంపుల్లో ఎలాంటి మోసాలు జరుగుతాయంటే?
భర్తలు తప్పు చేస్తే ఏవండీ మీరు చేసేది తప్పు అని చెప్పాల్సిన భార్యలే.. జనాన్ని మోసం చేద్దాం, జనం మీద పడి దోచుకు తిందాం అంటే సపోర్ట్ చేశారు. పైగా పోలీసు భార్యలు. ఇద్దరు పోలీసు సహోదరులు తమ భార్యలతో కలిసి భారీ స్కాంకు పాల్పడ్డారు. చివరికి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
బంగారం కొంటున్నారా? అయితే కొనే ముందు ఒకసారి ఈ విషయాలు తెలుసుకోండి. లేదంటే గ్రాము బంగారం దగ్గర రూ. 120 వరకూ నష్టపోయే అవకాశం ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం దగ్గర రూ. 1200 నష్టపోతారు. కాబట్టి నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, ఇతర కారణాలతో పెద్ద పెద్ద సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉన్నత స్థాయి నుండి చిన్న స్థాయి ఉద్యోగుల వరకు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నవారే. దీంతో ఐటి ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. దీనికి తోడు కొంత మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలిపిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తీరా అవి బోర్డు తిప్పేసరికి బాధితులు లబోదిబోమంటున్నారు.
‘గాలి వాటం లాగా సాగే అలవాటే లేక’అంటూ ఒక్క పాటతోనే అందరినీ మెస్మరైజ్ చేసిన యంగ్ టాలెండెట్ సింగర్ కొండేపూడి యశస్వి. ఇప్పుడు అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. ఫేమ్ కోసం ఓ ఎన్జీవోకి సాయం చేసినట్లు చెప్పుకుని మోసం చేశాడని ఆరోపణలు రాగా, వివరణనిచ్చారు. కాగా, ఆయనకు తోటి సింగర్లు మద్దతుగా నిలుస్తున్నారు.
సోషల్ మీడియా కొంత మంది వరంగా మారితే, మరికొంత మందికి శాపంగా తయారైంది. నిరుద్యోగంలో కూరుకుపోయిన కొంత మంది మహిళలకు ఇదే సోషల్ మీడియా చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఒక్కరూ కాదూ మొత్తం 13 మంది మహిళలు మాయగాడి మాటలు నమ్మారు. సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని ఉద్యోగాలను ఇప్పిస్తామని వీరిని ముగ్గులో దించిన కేటుగాడు.. వారి జీవితాలను నరకప్రాయం చేశాడు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసేవాడు. వీడి టార్చర్ ను తట్టుకోలేక ఓ యువతి […]
జమైకా చిరుత, పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ ఖాతాల నుండి డబ్బులు మాయమయ్యాయి. జమైకాలోని ఓ ప్రైవేటు పెట్టుబడి సంస్థల్లోని అతని ఖాతా నుండి 12.7 మిలియన్ డాలర్లను( భారత కరెన్సీలో దాదాపు రూ. 103 కోట్లకు పైచిలుకు) దోచుకున్నారని ఉసేన్ బోల్ట్ న్యాయ వాదులు తెలిపారు. బోల్ట్ ఖాతాలో 12.8 డాలర్లు ఉండగా, ఇప్పుడు 12 వేల డాలర్లను మాత్రమే చూపిస్తుందని అన్నారు. కాగా, ఆ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఈ చేతి వాటాన్ని […]