దేశ ప్రజలకు కేంద్రం తీపి కబురు అందించింది. ప్రజలకు పెనుభారంగా మారిన వంట గ్యాస్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్ సిలిండర్ల ధరలను కేంద్రం రూ.200 తగ్గించింది. పీఎం ఉజ్వల యోజన కింద కనెక్షన్ తీసుకున్నవారికి రూ.200 సబ్సిడీ అనేది ఏడాదికి 12 సిలిండర్లకు వర్తిస్తుంది. ఈ తగ్గింపుతో 9 కోట్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ తగ్గింపుతో ప్రస్తుతం హైదరాబాద్ లో రూ.1003గా ఉన్న డొమెస్టిక్ సిలిండర్ ధర […]
సామాన్యులకు పెనుభారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. తద్వారా ఇప్పుడు పెట్రోల్ పై లీటర్‌కు రూ. 9.5, డీజిల్‌పై రూ.7 తగ్గనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో చమురు కంపెనీలు మే 21న పెట్రోల్ – డీజిల్ కొత్త […]
గత కొన్ని రోజులుగా తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రగడ కొనసాగుతుంది. తాజాగా తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నులను సేకరించనుంది. ఖరీఫ్‌లో మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పింది కేంద్రం. ఇప్పుడు తీసుకునే దానితో కలిపి మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనుంది కేంద్రం. […]
ఇప్పుడు చాలా మంది కొత్త కార్లు తీసుకుంటున్నారు. కొత్త కారు కొంటే కచ్చితంగా చాలా కంపెనీలు ఎయిర్ బాగ్స్ ఇస్తున్నాయి. అయితే ఇప్పటికే కార్లు కొన్న వారు, అందులో ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే కచ్చితంగా వాటికి కూడా ఎయిర్ బ్యాగ్స్ పెట్టుకోవాల్సిందే. ఇప్పటి వరకు డ్రైవర్ సీటుకు మాత్రమే ఏర్పాటు ఉన్న ఎయిర్ బ్యాగ్, డ్రైవర్ పక్కనే ఉన్న మరో సీటుకు కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని రహదారి రవాణా శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక […]