బుధవారం విశాఖ బీచ్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన గర్భిణీ శ్వేత కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్తింటి వేధింపులు భరించలేక తన కూతురు చనిపోయి ఉంటుందని.. శ్వేత తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విజయవాడ విద్యాధరపురానికి చెందిన నిమ్మల సామ్రాజ్యంకు కరోనా సోకడంతో ఆమె కుమారుడు గణేష్ ఈ నెల రెండో తేదీ మంగళగిరిలోని ఓ ప్రైవేటు జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మూడో తేదీన ఆమెకు ఆరోగ్యశ్రీ కింద బెడ్ కేటాయించారు. అక్కడెవరూ పట్టించుకోకపోవడంతో గణేష్ తన తల్లిని ఇంటికి తీసుకువెళ్లాడు. తమ ఇష్టప్రకారమే ఇంటికి తీసుకువెడుతున్నట్టు గణేష్‌చేత ఓ పత్రాన్ని ఆస్పత్రి సిబ్బంది రాయించుకున్నారు. ఇంటివద్దే వైద్యం చేయిస్తుండగా ఆమె ఈనెల ఎనిమిదో తేదీన మృతిచెందారు. అయితే ఆమెకు చికిత్స […]