ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గాయపడ్డవారికి, మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పెను విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ సంబరాల సదర్భంగా కార్యకర్తలు పేల్చిన బాణసంచా ఘోర ప్రమాదానికి దారి తీసింది. బాణసంచా కారణంగా గుడిసెలో లో పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందగా.. పదికి పైగా మందిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో చోటుచేసుకున్న అపశృతి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ఘటనపై స్పందించారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చటంతో అది కాస్తా గుడిసెపై పడి లోపల ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఓ వ్యక్తి మరణించగా .. పది మందికి పైనే తీవ్రంగా గాయపడ్డారు. కొందరి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి.