పోలీస్ స్టేషన్‌లో రెండు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది అధికారులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మరి ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది అంటే..
. శివకాశి పరిసర ప్రాంతాల్లో ఉన్న బాణా సంచా ఫ్యాక్టరీల్లో ఒక్కొక్కసారి పేలుళ్లు జరుగుతుంటాయి. కూలీలుగా వచ్చిన వారు.. ఈ ప్రమాదకర ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది.
మనిషికి ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హఠాత్తుగా గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోతున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కొంతమంది అనుకోని ప్రమాదాల వల్ల దుర్మరణం చెందుతున్నారు.
ఒక్పప్పుడు వంట చేయాలంటే కట్టెల పొయ్యి.. లేదంటే పిడకలు వాడేవారు. ఇక వర్షాకాలంలో చూడాలి ఆడవారి తిప్పలు. కట్టెలు, అప్పుడప్పుడు పొయ్యి కూడా తడిచి.. వంట చేయడానికి నాకా ఇబ్బందులు పడేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు అలవాట్లు, పద్దతులు, పరికరాలు మారాయి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు అరుదు. ఇప్పుడు ఎక్కడ చూసినా గ్యాస్ పొయ్యిలే దర్శనం ఇస్తున్నాయి. దీనివల్ల ఆడవాళ్లకు పని సులువు అయ్యింది.. పొగ వల్ల వచ్చే ఇబ్బందులు తప్పాయి. […]
సాధారణంగా జనావాసాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చూసుకుంటారు. కానీ అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్‌లోనే కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఓ పోలీస్ స్టేషన్‌లో పేలుడు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఇక పోలీస్ స్టేషన్ ఆవరణలో వెనుక వైపు ఉన్న భవనం దగ్గర శనివారం వేకువజామున […]
ప్రకాశం జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 300 నిండు గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న 100కు పైగా సిలిండర్లు పేలినట్లు సమాచారం. లారీ పూర్తిగా కాలిపోయింది. అనంతపురం-గుంటూరు నేషనల్ హైవే మీద గురువారం అర్థరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన లారీలో భారత్ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. వీటిని కర్నూలు నుంచి నెల్లూరు తీసుకెళ్తున్నారు. ఈ […]
ఎండాకాలంలో చల్లగా ఉంటుందని ఏసీ వేసుకొని పడుకుంటునారా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏసీ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని మరియమ్మనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి 12.40 గంటల ప్రాంతంలో జరగగా, దంపతులు, ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మృతి చెందారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఏసీ వెంట్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లుగా ప్రాథమిక విచారణలో […]
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ దర్శనమిస్తుంది. ఫోన్ అనేది మన నిత్య జీవితాల్లో ఓ భాగం అయిపోయింది. ఇక ఫోన్ వాడకంలో యువత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్ పక్కనే ఉండాలి. ఆఖరికి చార్జింగ్ పెట్టి మరి వాడుతుంటారు. అలా చేయడం చాలా ప్రమాదం అని హెచ్చరించినా వినరు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి శంకర్ పల్లి […]
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. ప్రతి రోజూ ఎంతో కొంత మొత్తంలో ధరలు పెరుగుతూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అందరి చూపు.. ఎలక్ట్రిక్ వాహనాల వైపుకు మళ్లింది. ఇవి ఒకసారి ఛార్జ్ చేస్తే.. బ్యాటరీ కెపాసిటీని బట్టి 50 నుంచి 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తున్నాయి. అందువల్ల వాహన ప్రియులు అందరూ ఎలక్ట్రిక్ బైకుల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇలాంటి తరుణంలో తమిళనాడు, వేలూరులో జరిగిన ఒక సంఘటన ఎలక్ట్రిక్ వాహనదారులను భయపెడుతోంది. ఆ […]
ఇంటర్నేషనల్ డెస్క్- సౌత్ ఆఫ్రికాలో విషాదం చోటుచేసుకుంది. బంగారు గనిలో పేలుడు సంభవించింది. దీంతో సుమారు 59 మంది చనిపోగా, మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన బుర్కినాఫెసో లో జరిగింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నైరుతి బుర్కినాఫెసో లోని బాంబ్లోరా గ్రామం వద్ద ఉన్న బంగారు గనిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీ పేలుడుకు బంగారాన్ని శుద్ధి […]