హైదరాబాద్ లో స్థలం కొనాలంటే కొనలేని పరిస్థితి. స్థలం కొనలేకపోతున్నామని బాధపడకండి. హైదరాబాద్ లో కొనడం కంటే ఏపీలో డెవలప్ కానున్న ఏరియాలో కొనడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ధరలు చాలా తక్కువ పలుకుతున్నాయి. అయితే ఏడాదిలో 25 శాతం వృద్ధి రేటు ఉంటుందని చెబుతున్నారు. ఇది హైదరాబాద్ లో హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో ఫ్లాట్ ధరలు పెరుగుతున్న వృద్ధి రేటు కంటే ఎక్కువ.
ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి సీఎం జగన్ బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంధ్రలో అభివృద్ధి పనులపై దృష్టిసారించారు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా విజయ నగరంలో పర్యటించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు శంకు స్థాపన చేశారు. ఈ పర్యటన సమయంలో కూడా సీఎం తన పెద్ద మనస్సు చాటుకున్నారు.