ప్రపంచంలో ఒక్క మనిషి ప్రాణం తప్ప ఏదైనా అద్దెకు లభిస్తుంది. తమ అవసరాల కోసం ఖరీదు చేయలేని ఏ వస్తువైనా అద్దెకు తీసుకొని అవసరాలు తీసుకునే సౌలభ్యం ఉంటుంది. కొన్నిచోట్ల సేవలు చేయించుకోవడానికి మనుషులను కూడా అద్దెకు తీసుకుంటుంటారు..
ఏ దేశానికి అయినా ఆపదల నుంచి రక్షించేది ఆదేశ సైన్యమే. రక్షణ వ్యవస్త లేకపోతే దేశంలో ప్రశాంత వాతావరణం ఉండదు. పొరుగు దేశాల నుంచి ఎదురయ్యే దాడులను, ఉగ్రవాదుల నుంచి వచ్చే ముప్పును అడ్డుకొని దేశ సంపదను, పౌరులను సైన్యమే నిరంతరం రక్షిస్తూ ఉంటుంది. మరి ఇలా కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యంపై ప్రతిఒక్కరు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
షాపింగ్ మాల్, ఎలక్ట్రిక్ షోరూం, ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. షాపింగ్ మాల్ రాత్రి నుంచి తగలబడుతూనే ఉండగా.. ఎలక్ట్రిక్ షోరూంలో వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఆసుపత్రి కిటికీల్లోంచి రోగులు తప్పించుకునే ప్రయత్నం చేశారు.
పూర్వకాలంలో ఒకచోట నుంచి మరోచోటుకి ప్రయాణం చేయాలంటే నడిచి వెళ్లేవారు. ఆ తరువాత చిన్న చిన్న వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. రైట్ సోదరులు విమానం కనుగొన్న తరువాత మానవ ప్రయాణంలో వేగం పెరిగింది. ఇప్పుడు భూమిమీద నుంచి స్పేస్‌లోకి ప్రయాణం చేస్తున్నారు. అయితే, ఒక దేశం నుంచి మరోక దేశానికి ప్రయాణం చేయాలంటే విమానంలోనూ దూరాన్ని బట్టి సమయం ఉంటున్నది. దీంతో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విధంగానే హైస్పీడ్ విమానాలను తీసుకురావాలని అమెరికా, చైనా, ఫ్రాన్స్, […]