బ్యాంకుల్లో, ఏటీఎంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎం సెంటర్లలోకి చొరబడి లక్షల్లో డబ్బులను దొంగిలిస్తుంటారు. తాజాగా సోమవారం కూడా ఓ ఏటీఎంలో దొంగలు చోరీ చేశారు. కానీ అందులోని డబ్బులను కాదు.
ఒకప్పుడు బ్యాంకుల్లో ఎక్కువగా చోరీలు జరిగేవి. ఖాతాదారుల సొమ్మును భద్రంగా దాచే బ్యాంకులను కేటుగాళ్లు టార్గెట్ చేసేవారు. పక్కా ప్లానింగ్‌తో బ్యాంకుల్లో నుంచి లక్షలాది రూపాయలను కొట్టేసేవారు. బ్యాంకు చోరీ కేసుల్లో చాలా మంది దొంగల్ని పోలీసులు పట్టుకున్నారు, వారికి కోర్టులు శిక్షలు కూడా విధించాయి. కానీ ఈ తరహా నేరాలు మాత్రం ఆగడం లేదు. ఏటీఎంలు వచ్చినప్పటి నుంచి బ్యాంకుల్లో దొంగతనాలు తగ్గాయనే చెప్పొచ్చు. అయితే ఏటీఎంల్లో దొంగతనాలు పెరిగాయి. రాత్రిపూట ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని […]
డబ్బు.. మనిషి ప్రయాణం మొత్తం దీని చుట్టూనే తిరుగుతోంది. చేతిలో రూపాయి లేకపోతే.. పలకరించే మనిషి కూడా ఉండడు. ఏదో బాగున్నావా అంటారా! కానీ, ఆప్యాయత, అనుబంధం ఎక్కడా కనబడవు. ఇలాంటి రోజుల్లో అడిగిన దాని కంటే.. ఐదు రెట్లు ఎక్కువ డబ్బు వస్తోందంటే జనాలు ఊరుకుంటారా! ఆ.. ఆ.. తండోపతండాలుగా ఎగబడ్డారు. పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి రూ. 500 తీసుకుందామని ఎటిఎంకు వెళ్తే, రూ.2500 వచ్చాయి. అంతే.. ఆ ఏటీఎంకు వందలాదిగా జనం క్యూ […]
Viral Video: దేశంలో ఏటీఎమ్ సెంటర్ల సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తం కాకపోయినా.. చాలా చోట్ల ఏదో ఒక సమస్యతో వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల ఏటీఎమ్ సెంటర్లు కాస్తా జంతువుల స్థావరాలుగా మారిపోయిన సంఘటనలు కూడా వెలుగు చూశాయి. తాజాగా, ఓ ఏటీఎమ్ సెంటర్ బందుల దొడ్డిగా మారింది. ఓ ఆవు అందులో సేదతీరి రచ్చ రచ్చ చేసిపెట్టింది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్య […]