తెలుగు రాష్ట్రాలలో చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒకటి మరవక ముందే మరొకటి చోటుచేసుకోవడం, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఉంటుండడం అటు ప్రజలను, ఇటు అధికారాలను కలవర పాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా, అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అచ్యుతాపురం సెజ్‌లోని […]
ఇటీవల విశాఖలో పలు కంపెణీల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. విషవాయువులు లీక్ కావడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. తాజాగా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువు లీక్ కావడంతో పలువురు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ అచ్యుతాపురం, అనకాపల్లిలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీకైంది. ఈ విషవాయువు పీల్చుకొని 150 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. విష వాయువును పీల్చుకొని […]