ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు, జలపాతాలు పొంగిపొర్లుతున్న విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వాననీరు వచ్చి జనజీవనం అస్తవ్యస్తం అయిపోయారు. పలుచోట్ల రోడ్లు, వంతెనలు కూడా నీట మునిగిపోయాయి.
ఇటీవల కాలంలో చిన్న వయస్సులోనే గుండె పోటుతో మరణించిన ఘటనలు ఎక్కువగానే చూశాం. జిమ్ చేస్తూ కానిస్టేబుల్, ఆడుకుంటూ ఇంటికి వచ్చిన 13 ఏళ్ల బాలిక, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నిండా 30 దాటని వారెందరో చనిపోయారు. తాజాగా ఓ బాలుడ్ని గుండె పోటు బలి తీసుకుంది
కొంతమంది డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఎదుటి వారు ఏమైనా పరవాలేదు.. తాము బాగుండాలన్న ఉద్దేశ్యంతో మోసాలకు పాల్పపడుతున్నారు. అమాయకులకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి అందినంత దోచుకుంటున్నారు.
ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సులోంచి డ్రైవర్ దూకేయడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన తెలంగాణలోని కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పడంతో బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదం బస్సు డ్రైవర్ వల్లే జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సులోంచి డ్రైవర్ ఉన్నట్టుండి అకస్మాత్తుగా దూకేయడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని చెబుతున్నారు. డ్రైవర్ […]
కటిక పేదరికంలో ఉన్న ఆ యువతి ఉన్నత చదువులు చదివి గొప్ప ప్రయోజకురాలిగా అవ్వాలని కలలు కనింది. ఇందు కోసం ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లో చేరింది. జీవితంలో ఏదో సాధించాలని కలలు కన్న ఆ యువతి హస్టల్ లోనే శవమై తేలింది. తాజాగా కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఆ వెల్ఫేర్ హాస్టల్ లో ఏం జరిగింది? యువతి మరణించాడానికి కారణం ఏంటనే పూర్తి […]
తడోబా పులుల అభయారణ్యంలో పెద్ద పులుల సంచారం ఎక్కువ. ఇక్కడినుంచే తెలంగాణలోని అడవుల్లోకీ పెద్ద పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. అందులో మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులోని ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఉన్న అటవీ ప్రాంతం వాటికి సురక్షిత కారిడార్. ఇప్పుడు ఇదే ప్రాంతం మీదుగా నాగ్‌పూర్–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మితం కాబోతోంది. 4 వరుసలుగా నిర్మించే ఈ రహదారి పులులతోపాటు ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే అడవిని చీలుస్తూ వాటి ప్రాణానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. దీంతో ఈ […]
మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవించడం కోసం ప్రతి స్త్రీ పరితపించిపోతుంది. తాను మరణించి అయినా సరే బిడ్డకు జన్మనివ్వాలని భావిస్తుంది. పురిటి నొప్పులు స్త్రీకి పునర్జన్మ అంటారు. ఆ సమయంలో స్త్రీలు భరించే వేదనను వర్ణించడానికి మాటలు చాలవు. అనుభవిస్తే.. కానీ ఆ బాధ అర్థం కాదు. అయినా సరే.. వాటన్నింటిని భరించి మరీ బిడ్డకు జన్మనిస్తుంది స్త్రీ. ఇక బిడ్డ పుట్టిన తర్వాత ఆ మహిళ ఎంత బలహీనంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆపరేషన్ ద్వారా బిడ్డకు […]
దేశంలో ప్రస్తుతం ఎటు చూసినా వానలు కుమ్మేస్తున్నాయి. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అతీతం ఏమి కాదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఆగకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షాల కారణంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వణికిపోతోంది. ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ సిర్పూర్ యు లింగాపూర్ మండలాలలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇళ్లలో నుండి బయటకి రాలేని పరిస్థితిలు […]