పిల్లలకు కూడా మొట్టమొదటి హీరో తండ్రే. తల్లి పిల్లల కోసం పడుతున్న తపన కనబడుతుంది కానీ..తండ్రి పడుతున్న కష్టం కనిపించదు. ఎక్కువగా అమ్మ లాలనలో పెరుగుతూ.. తండ్రి కోపాన్ని, గుంభన మనస్థత్వాన్ని చూసి కొంత దూరంగా మసలుతుంటారు.. చిన్నప్పడు తెలియదు నాన్న కష్టం. వారు పెరిగి పెద్దయ్యాక.. వారు ఓ బిడ్డలకు తల్లిదండ్రులయ్యాక తెలుస్తుంది
ఏ దేశానికి అయినా ఆపదల నుంచి రక్షించేది ఆదేశ సైన్యమే. రక్షణ వ్యవస్త లేకపోతే దేశంలో ప్రశాంత వాతావరణం ఉండదు. పొరుగు దేశాల నుంచి ఎదురయ్యే దాడులను, ఉగ్రవాదుల నుంచి వచ్చే ముప్పును అడ్డుకొని దేశ సంపదను, పౌరులను సైన్యమే నిరంతరం రక్షిస్తూ ఉంటుంది. మరి ఇలా కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యంపై ప్రతిఒక్కరు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏవోసీ రీజియన్లలో ఖాళీగా ఉన్న 3068 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా.. ట్రేడ్స్‌మన్ మేట్, ఫైర్‌మ్యాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆ వివరాలు.. ముఖ్య వివరాలు: ఖాళీలు: 3068 విభాగాలు: ట్రేడ్స్‌మ్యాన్ మేట్, ఫైర్‌మ్యాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. అర్హతలు: ట్రేడ్స్ మెన్ మేట్ ఉద్యోగాలకు.. గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుండి 10వ […]
దేశానికి సేవ చేయాలనుకున్నాడు.. కానీ, దేశపౌరుల చేతిలోనే తిరిగిరాని లోకాలకు వెల్లిపోయాడు. బోర్డర్‌లో శత్రు దేశ సైనికులను మట్టు బెట్టాలనుకున్నాడు. కానీ, బుల్లెట్లకు బలయ్యాడు. దేశ సేవలో మరణిస్తే.. అమరుడయ్యాడు అనేవాళ్లు.. కానీ, ఇప్పుడు ఆందోళనలో తనువు చాలించాడు. అతనే 18 ఏళ్ల రాకేశ్. అగ్నిపథ్ ఆందోళనల్లో పోలీసుల తూటాలకు బలయ్యాడు రాకేశ్. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లాడు. అగ్నిపథ్‌కు కార్యక్రమానికి వ్యతిరేకంగా యువకులు ఆందోళనకు దిగడంతో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత […]
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని చాలామంది యువకులు భావిస్తుంటారు. అయితే అందరికి ఆ అవకాశం రాదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ ప్రతిష్టాత్మక పథకాన్ని ముందుకు తీసుకువచ్చింది. దీని వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయని భావించింది. ఒకటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కాక.. వారికి దేశానికి సేవ చేసే అవకాశం కూడా ఒకేసారి లభించడం. ఈ రెండు ప్రధానాంశాలుగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ అనే పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా యువకులు త్రివిద దళాల్లో […]
కొండ చరియల్లో ఇరుక్కుని ఒక యువకుడు ఇబ్బంది పడుతున్నాడు. కేరళలోని పాలక్కాడ్ సమీపంలోని మలప్పజ ప్రాంతంలోని కొండచరియల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా కేరళ మలప్పజలో కొండ చీలికలో చిక్కుకున్న యువకుడిని ఆర్మీ రక్షించింది. గత మూడు రోజులుగా కొండ చీలికలో చిక్కుకొని నరకం అనుభవించాడు యువకుడు. యువకుడిని కాపాడేందుకు సీఎం పినరై విజయన్ సైన్యం సాయం కోరాడు. ఈరోజు బెంగళూరు నుంచి పారా కమాండోలు వచ్చి రిస్క్ చేసి ఆ యువకుడిని రక్షించారు. ఇది […]
ఉగ్రవాదులపై పోరులో భాగంగా కశ్మీర్‌లో ప్రాణ త్యాగంచేసిన గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన జవాను జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశ రక్షణలో భాగంగా కశ్మీర్‌లో తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటం చేశారని, జశ్వంత్‌రెడ్డి త్యాగం నిరుపమానమైనది అన్నారు. జశ్వంత్‌రెడ్డి వీరమరణం పొందడంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. జశ్వంత్‌రెడ్డి త్యాగం మరువలేనిదని అన్నారు. కడప జిల్లా పర్యటనలో […]