మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెదేపా మహిళా కార్యకర్తలు ముట్టడించారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో కమిషన్ కార్యాలయం వద్ద మహిళలు నిరసనకు దిగారు. ఈ సందర్బంగా మహిళలపై జరిగిన దాడుల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే అనిత ప్రశ్నించారు. తమను కమిషన్ కార్యాలయంలోకి అనుమతిచకపోతే ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మనే కిందకు రావాలని […]