ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఆ హామీపై రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే విభజన సందర్భంగా.. పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని.. నాటి ప్రదాని మంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. కానీ తర్వాత అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో అధికారం వేరే వారి చేతుల్లోకి వెళ్లింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కకు పెట్టి.. ప్యాకేజీ ప్రకటించింది. అయితే రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచించే నేతలు […]
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది. ప్రత్యేక హోదా అంశం అసలు ఉనికిలోనే లేదని కేంద్రం స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో వైసీపీ నాయకులు ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్రం.. ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదని వెల్లడించింది. ఇవాళ డిసెంబర్ 12న జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రణాళిక మంత్రి రావ్ […]
డిసెంబర్ 7 నుంచి 29 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశంపై పోరాడేందుకు వైసీపీ పార్టీ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రావాల్సిన విభజన హామీలు, ప్రత్యేక హోదా వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తేందుకు వైసీపీ పార్టీ సిద్ధమైంది. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదాపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా డిమాండ్ ను పార్లమెంటులో సంధించనున్నారు. ప్రత్యేక హోదాపై ప్రైవేట్ మెంబర్ […]
రాజకీయ పార్టీ, నేతలకు అధికారంతో సంబంధం లేకుండా.. విపక్షంలో ఉన్నా సరే.. నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజా సమస్యలపై పోరాడాలి. అలా కాకుండా మౌనం దాల్చితే.. అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుంది. కార్యకర్తలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తుతుంది. ఎందుకంటే అధిష్టానం నిర్ణయంతోనే వారు ఏ కార్యక్రమాన్ని అయినా నిర్వహించాలి. అలాంటిది అధినేతే మౌనంగా ఉంటే.. తాజాగా ఏపీ టీడీపీలో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా టీడీపీ ఏ అంశంపై […]
త్వరలోనే ఏపీకి ప్రత్యేక హోదా రాబోతుందా.. కేంద్ర సర్కార్ దీనిపై సానుకూలంగా ఉందా అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తుంది. వీటికి తోడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశపు అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరినట్లు అయింది. దీనికంటే ముందే పార్లమెంటులో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు చూస్తే.. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం సానుకూలంగా ఉందనే అనిపిస్తోంది. తాజాగా మోదీ పార్లమెంటులో విభజన అంశంపై స్పందిస్తూ.. ఏపీకి అన్యాయం […]
ఏపీ రాజకీయాల్లో నిత్యం అధికార, ప్రతిపక్షలా మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తుంటాయి. అధినేత చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకహోదాపై సీఎం జగన్ ఎందుకు పోరాడడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోతే రాజీనామా చేస్తానని సీఎం జగన్ గతంలో చెప్పలేదా? హోదా వస్తే రాష్ట్రం మారిపోతుందని అనలేదా? హోదా వస్తే ఒంగోలు కూడా హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందుతుందని […]