ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో చాలా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ఎండలు దంచికొడుతున్నాయి.. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అంతలోనే వాతావరణం చల్లబడి విపరీతమైన వర్షాలు పడుతున్నాయి.
ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం ఎండలు మండిపోతున్నాయి.. సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు రావడం.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వడగండ్ల వానలు కురియడంతో పంటనష్టం ఏర్పడి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అనుకోని వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు చోట్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వడగండ్ల వాన రావడంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. పలు చోట్ల పిడుగులు కూడా పడ్డాయి.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలకు, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ సీఎం జగన్ మరోసారి రుజువు చేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో మాండూస్ తుపాను, భారీ వర్షాలపై కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, కలెక్టర్లు నష్టం అంచనా విషయం ఎంతో ఉదారంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదంటూ సూచించారు. ఏ ఒక్క రైతు కూడా అధికారుల నష్టం అంచనాతో […]
రెండు తెలుగు రాష్ట్రాలో రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు అల్లడిపోతున్నారు. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న వాయుగుండం మరింత బలపడింది. ఉత్తరం వైపు గడచిన 06 గంటల్లో 20 కిలోమీటర్ల […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వానలు వెంటాడుతున్నాయి. మూడు రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాలతో ఇంకా తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్‌ను మరో వాన గండం భయపెడుతోంది. ఈ మేరకు విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాబోవు 72 గంటల్లో ఏ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో తక్కువ ట్రోపోస్పియరిక్ స్థాయిల్లో సర్క్యులేషన్ ఉందని వాతావరణ నిపుణలు గుర్తించారు. రాబోయే నాలుగైదు రోజుల్లో […]