మెడికో ప్రీతి విషాదకర మరణంపై జనసేన పవన్ కల్యాణ్ స్పందించారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాలేజీ యాజమాన్యం సరైన టైంకి స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటామన్న ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. వారంతా మృత్యు ఒడికి చేరుకున్నారు. స్థానికులు ఈ ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంక్రాంతి.. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పెద్ద పండగ. ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లి సెటిల్ అయిన వారంతా ఈ ఒక్క పండగ కి మాత్రం తమ సొంత ఊరికి చేరుకుంటూ ఉంటారు. చుట్టాలు, స్నేహితులు మధ్య పండగ మూడు రోజులు ఆనందంగా గడపాలని తపిస్తూ ఉంటారు. ఇందుకే ఎంత కష్టం అయినా.. సంక్రాంతికి అందరూ కచ్చితంగా ప్రయాణాలు పెట్టుకుంటారు. అయితే.. ఇదే అదునుగా భావించే ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం ఈ గ్యాప్ లో దందాకి తెర లేపుతుంటాయి. […]
మొబైల్ ఫోన్.. దీన్ని కనిపెట్టిన వాడు ఎవడో గానీ నిజంగా దండేసి దండం పెట్టాలి. లేకపోతే ఏంటి… ప్రస్తుతం ఇది లేకపోతే ఒక్కపని కూడా జరగదు. ఉదయం నిద్రలేచిన రాత్రి నిద్రపోయే వరకు ప్రతి పనిలోనూ మొబైల్ అవసరం కచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన శరీరంలో చేయి, కాలు ఎలానో.. మొబైల్ కూడా అలా ఓ భాగమైపోయింది. మరి అలాంటి మొబైల్ పోతే, తిరిగి దక్కించుకోవడం చాలా కష్టం. పోలీసుల దగ్గరకు వెళ్లాలి, ఫిర్యాదు చేయాలి. […]
Anil Kumar Yadav: ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఎన్టీఆర్ వారసులైన కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ట్వీట్ల ద్వారా స్పందించారు.. ‘‘1986లో విజయవాడలో మెడికల్ యూనివర్సిటీ స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యని అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు మహావిద్యాలయానికి అంకురార్పణ చేశారు. […]
ప్రముఖ సినీ నటి జీవితా రాజశేఖర్ గురువారం చిత్తూరు జిల్లా నగరి కోర్టుకు హాజరయ్యారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఆమె గత కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై కోర్టులో పిటిషన్ వేశారు. తమకు జీవితా రాజశేఖర్.. రూ. 26 కోట్లు బకాయి పడ్డారంటూ ఇటీవల జోస్టర్ గ్రూప్ యాజమాన్యం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమ వద్ద జీవిత అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదని ఆరోపించింది. జీవిత ఇచ్చిన చెక్ బ్యాంకులో […]
Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనలో భద్రతా వైపల్యం వెలుగుచూసింది. మోదీ హెలికాప్లర్ వెళ్లే మార్గంలో పెద్ద సంఖ్యలో నల్ల బెలూన్లు దర్శనమిచ్చాయి. ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టునుంచి భీమవరం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఎయిర్ పోర్టుకు 2 కిలో మీటర్ల దూరంలో డజన్ల కొద్దీ బెలూన్లను ఎగురు వేశారు. కేసరి పల్లి గ్రామంలో ఈ బెలూన్లు గాల్లోకి లేచినట్లు తెలుస్తోంది. ఆ మార్గంలో వెళుతున్న మోదీ […]
మూడు రాజధానుల అంశంపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులపై తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని, పాలనా వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయటమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంపై కేంద్రం నియమించిన జస్టిస్ శివరామకృష్ణన్ కమిటీ కూడా పాలనా […]
నేటికాలంలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. కష్టపడి సంపాదించలేని వారు, సుఖానికి అలవాటు పడి.. ఇతరులు కష్టపడి సంపాందించి.. కూటబెట్టుకున్న సొమ్మును రెప్పపాటు కాలంలో కాజేస్తున్నారు. చివరికి అందరికి అన్నం పెట్టి..ఆదుకునే రైతు ఆరుగాలలు శ్రమించి పండించిన పంటను అమ్ముకుని వస్తుంటే దారి కాచి ఆయన డబ్బు దొగిలించారు. ఆ రైతు వేదన వర్ణాతీతం. ఈఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తలవల్లం గ్రామానికి చెందిన కువ్వాకొల్లి మునిరాజా రేయింబవళ్లు శ్రమించి పడించిన పంటను […]
తిరుమల శ్రీవారి దర్శనానికి దేశవిదేశాల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తులతో రద్దీగా ఉంటే తిరుమలలో కరోనా మహమ్మారి కారణంగా కొన్నాళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. తితిదే అధికారులు కరోనా కట్టడికి కొన్ని ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. అయితే తాజాగా శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. గతంలో కొవిడ్ తీవ్రత కారణంగా ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియ తితిదే నిలిపివేసిన విషయం తెలిసింది. తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన […]