వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచి ఏపీలో అధికార, ప్రతిపక్షాలు వ్యూహరచనలు చేస్తున్నారు. ప్రభుత్వ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని.. రాష్ట్రాన్ని దివాలా తీసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళ్తే.. ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్తు ప్రచారం చేస్తున్నారు అధికార పక్ష నేతలు. ఈ క్రమంలో జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతూ వస్తుంది.
” ప్రభుత్వం ఉద్యోగులు సమయానికి ఆఫీసుకు రారు. ఏ పనులు సకాలంలో చేయరు. కానీ నెల జీతం మాత్రం కరెక్ట్ గా తీసుకుంటారు”.. ఇది ప్రభుత్వ ఉద్యోగుల పై కొందరికి ఉండే అభిప్రాయం. అలానే ఉద్యోగులు సమయానికి రావాలి.. వారి విధులు సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఏ ప్రభుత్వమైన కోరుకుంటుంది. ఉద్యోగుల చేత సరిగ్గా పని చేయించుకోవడం ముమ్మాటికీ ప్రభుత్వాల బాధ్యతే. దానికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటాయి. […]
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఏ రేంజ్ లో ఉందో ‘చలో విజయవాడ’తో అర్థం అయ్యింది. ఈ కార్యక్రమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసింది. వారం రోజలు ముందు నుంచే కార్యక్రమాన్ని ఎలా అడ్డుకోవాలి అనే దాని మీద వ్యూహాలు రచిస్తూ వచ్చింది. అనుమతి నిరాకరణ మొదలు ముందస్తు అరెస్టుల వరకు ఎన్ని విధాలుగా ఉద్యోగులను అడ్డుకోవచ్చో అన్ని రకాలుగా ప్రయత్నించింది. అయినా సరే […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు. గత కొన్ని రోజులుగా పీఆర్సీ విషయంలో జగన్ సర్కార్ కు, ఉద్యోగులకు మధ్య వివాదం చలరేగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ సరిపోదని, దానిపై పునరాలోచించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుండగా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకుని సర్దుకు పోవాలని జగన్ సర్కార్ చెబుతోంది. ఇదిగో ఇటువంటి సమయంలో తాము ప్రకటించిన కొత్త పీఆర్సీ మేరకు ప్రభుత్వం ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జీతాలను జమ చేస్తోంది. ఈ క్రమంలో […]
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ రగడ చిలికి చిలికి గాలివానగా మారుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో కొత్త జీవోల ప్రకారమే జీతాలు వస్తాయని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని, ఉద్యోగులకు సీఎం జగన్ అన్యాయం చేయబోరని ఉద్ఘాటించారు. ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పీఆర్సీ జీవోలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయా అంశాలపై చర్చించేందుకు […]