ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి కుల ధ్రువీకరణకు సంబంధించిన కేసు విచారణను ఏపీ హైకోర్టు వారం రోజులపాటు వాయిదా వేసింది. కుల ధ్రువీకరణ విషయంలో ‘అప్పీల్ అథార్టీ’ విచారణకు సంబంధించి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో నిన్న హైకోర్టులో విచారణ ప్రారంభం కాగా న్యాయవాది బి.శశిభూషణ్‌రావు వాదనలు వినిపించారు. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఎస్టీ […]