వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ).. ఆంధ్రప్రదేశ్ లో కూడా తన బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను చేర్చుకోవడంతో పాటు… సినీ గ్లామర్ ని కూడా ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే విజయశాంతి, జయప్రత, జీవిత తదితరులు బీజేపీలో ఉండగా… జయసుధ కూడా ఇదే పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో విషయం కూడా ఆసక్తి కలిగిస్తోంది. ఇక వివరాల్లోకి […]
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలోని మునుగోడు పర్యటనలో భాగంగా రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా వ్యక్తిగత సమావేశం అని పార్టీ వర్గాలు చెప్పినప్పటికీ, బీజేపీ పార్టీ నేతల చేష్టలు చూస్తుంటే రాజకీయ భేటీ అనే అనుమానాలు రాక మానదు. అమిత్ షా, ఎన్టీఆర్ ల మధ్య రాజకీయ చర్చలు జరిగాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో తారక్ ను ఉద్దేశించి ఏపీ బీజేపీ […]
గణతంత్ర దినోత్సవం నాడు దేశ వ్యాప్తంగా ప్రజలు జెండా పండుగ జరుపుకుంటుండగా.. గుంటూరులో మాత్రం.. ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు పహరా.. జనాల ఆందోళన మధ్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. జిన్నా టవర్ పై జాతీయ జెండా ఎగురవేస్తామని హిందూ వాహిని చేసిన ప్రకటనతో ఈ ఉద్రిక్తత మొదలైంది. అన్నట్టుగానే జిన్నా టవర్‌పై జాతీయ జెండా ఎగరేసేందుకు ప్రయత్నించారు హిందూ వాహినీ కార్యకర్తలు. కాగా వీరి ప్రయత్నాన్నిపోలీసులు అడ్డుకున్నారు. టవర్‌వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించినవారిని.. అరెస్ట్ చేసి అక్కడి […]
ఏపీ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంచి కిక్కిచ్చే వార్త చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. 75 రూపాయలకు చీఫ్ లిక్కర్ అందిస్తామని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ జనాగ్రహ సభలో మాట్లాడుతూ.. సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికార పార్టీనే పచ్చి సారా కాస్తూ.. 3 రూపాయల మద్యాన్ని రూ. 25కు కొని రూ.250కి విక్రయిస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. ఇది కూడా చదవండి : ఏపీ […]
బద్వేల్ ఉపఎన్నిక ఫలితాల్లో వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. అధికార పార్టీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90,950 మోజార్టీతో గెలుపొందారు. ఇది సీఎం జగన్ మోహన్ రెడ్డి మెజార్టీని మించిపోవడంతో ఒక్కసారిగా ఈమె పేరు మారుమోగింది. ఈ ఉప ఎన్నికల్లో తెదేపా, జనసేన పోటి చేయలేదు. బద్వేల్ ఉపఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రేస్ పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈమె మెజార్టీపైనే చర్చలు జరుగుతున్నాయి. నెటిజన్లు అంతా అసలు […]
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఢిల్లీ పెద్దలు ఉద్వాసన పలకనున్నారా..? ఇప్పడు ఇదే వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఢిల్లీ కాషాయ పెద్దలు సోము వీర్రాజుపై కాస్త గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేందుకు తెర వెనుక మంతనాలు జరుగుతున్నాయట. గతంలో అద్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తిరిగి నియమించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో పార్టీ కార్యక్రమాల్లో సోము కాస్త వెనకంజలో ఉన్నట్లు […]