విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. ముఖ్యంగా పరీక్షలకు సంబంధించి, అలానే వాటి మూల్యాంకన విషయంలో పలు నిర్ణయాలు తీసుకుంటారు. అలానే ప్రభుత్వాలు తరచూ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్తుంటాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఇటీవల ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో ఏదో ఒక అక్రమం బయట పడుతుంది. తెలంగాణలో పేపర్ లీకేజ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అలానే పదో తరగతి ఓపెన్‌స్కూల్ పరీక్షల్లో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి. ఏదో విధంగా ఓపెన్ స్కూల్ పరీక్షల్లో పాస్ కావాలని కొందరు అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ఇటీవలే అరకు లోయలో తెలుగు పరీక్ష జరిగిన సమయంలో హాల్ టికెట్లలో ఫొటోలు వున్న అభ్యర్థులు కాకుండా వేరే వారు పరీక్ష రాస్తుండడాన్ని గుర్తించారు. తాజాగా అలాంటి ఘటనే ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.
నేటి పోటీ ప్రపంచంలో ఒకరిని మించిన వారు మరొకరు ఉన్నారు. మంచి ఉద్యోగాలు పొందాలంటే మంచి విద్య అవసరం అని అంటారు. పదో తరగతి అనేది విద్యార్థి దశలో కీలకమైన మలుపు. ఈ కారణంతోనే పదవ తరగతి విద్యార్థులపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహిస్తుంటారు. తమ పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటారు.
పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదో తరగతి తుది పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేవెసులుబాటు కల్పించింది. విద్యార్థులు తమ వద్దనున్న హాల్ టికెట్ చూపించి పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
కొంత మంది చిన్నారులు అపరమిత పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. చిన్న వయస్సులోనే చదువులో ఆరితేరుతారు. ప్రతి విషయంపై అవగాహన ఎక్కువగా ఉంటుంది. పిట్ట కొంచెం కూత ఘనమన్న పేరు తెచ్చుకుంటారు. ఆ కోవకు వర్తిస్తుంది ఈ బాలిక కూడా.
10వ తరగతి విద్యార్థులకు ఆర్టీసీ ఓ శుభవార్త తెలిపింది. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 10వ తరగతి విద్యార్థులు ఎగిరిగంతులేస్తున్నారు.