అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ వస్తున్న ఆరోపణలపై సింగర్ శ్రావణ భార్గవి స్పందించింది. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదని, మీరు చూసే చూపులోనే తప్పు ఉందని వ్యాఖ్యలు చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. అందుకే చూసేవన్నీ తప్పుగా కనిపిస్తాయని, దుప్పటి కప్పుకుని కూర్చున్నా, చూపులో లోపం ఉంటే అశ్లీలంగానే కనిపిస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది శ్రావణ భార్గవి. వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసే సమయంలో భక్తి భావంతో పాడుకునే కీర్తనను శ్రావణ భార్గవి అపహాస్యం చేసిందని.. […]