చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం మోర్దానపల్లెలోని అమర రాజా బ్యాటరీ ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి సమయంలో పరిశ్రమలోని టీబీడీ ప్లాంట్‌లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో.. ప్లాంట్‌లో సుమారు 250 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్రిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని.. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని మాపక సిబ్బంది నాలుగు […]