అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన అందాల పోటీల్లో ఇండో అమెరికన్ టీనేజర్ ఆర్యవాల్వేకర్ మిస్ ఇండియా యూఎస్ఏ-2022 కిరిటాన్ని దక్కించుకుంది. ఈ పోటీల్లో వర్జీనియాకు చెందిన 18 ఏళ్ల ఆర్య వాల్వేకర్ విజేతగా నిలవగా.. ఫస్ట్ రన్నరప్‌గా వర్జీనియా వర్సిటీ పారామెడికల్ విద్యార్థిని సౌమ్య శర్మ, సెకండ్ రన్నరప్‌గా న్యూజెర్సీకి చెందిన సంజన చేకూరి నిలిచారు. ఈ సందర్భంగా ఆర్య వాల్వేకర్ మాట్లాడుతూ.. ఇప్పటికి తన కల నెరవేరిందని.. చిన్ననాటి నుంచి తనకు వెండితెరపై కనిపించాలనే కోరి ఉందని.. […]