కింగ్ కోహ్లీ కెప్టెన్‌గా టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవకపోయిన కెప్టెన్‌గా కోహ్లీ ఇంపాక్ట్ వేరే లెవల్. అగ్రెసివ్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లీ యువ ఆటగాళ్లకు అతనో స్ఫూర్తి ప్రదాత. మైదానంలో అతని బ్యాట్ గర్జన ప్రత్యర్థికి భయాన్ని, సొంత జట్టుకు అభయాన్ని ఇస్తుంది. టీమ్ సభ్యుడి సక్సెస్‌ను తన సక్సెస్ కన్న ఎక్కువ ఎంజాయ్ చేసే గొప్ప గుణం కోహ్లీ సొంతం. అది యువ క్రికెటర్లపై చాలా మంచి ప్రభావం చూపిస్తుంది. బాగా ఆడిన సమయంలో గొప్ప ఆటగాడు, జట్టు నాయకుడి నుంచి ప్రశంస ఒక యువ ఆటగాడికి ఇచ్చే సంతృప్తి, ఆనందం అంతాఇంతా కాదు. ఈ హ్యాపీ మూమెంట్‌ను శుక్రవారం తెలుగుతేజం కేఎస్ భరత్ పొందాడు.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 78 పరుగుల అద్భుత ఇన్సింగ్స్‌కు తోడు చివరి బంతిని సిక్స్ కొట్టి మరీ ఆర్సీబీ గెలిపించాడు భరత్. దీంతో డగౌట్‌లో కూర్చున్న కెప్టెన్ కోహ్లీ ఆనందంతో మైదానంలోకి పరిగెత్తుకొచ్చి భరత్‌ను ఆలింగనం చేసుకుని ప్రశంసించిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. యువ క్రికెటర్ అద్భుత ప్రదర్శనను ఇంతలా సెలబ్రెట్ చేసుకోవడం కోహ్లీ గొప్ప మనసుకు నిదర్శనం. పైగా ఈ మ్యాచ్ గెలిచినా, ఓడినా ఆర్సీబీకి ఎలాంటి నష్టం జరగదు. పాయింట్ల పట్టికలో వారి స్థానంలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ మ్యాచ్ సాగిన తీరు, చివరి ఉత్కంఠ వారి ఆనందానికి కారణమయ్యాయి. అలాగే కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ ఆడే ముందు విజయం ఆ జట్టుకు ఇచ్చే ఆత్మ విశ్వాసం వెలకట్టలేనిది. అలాంటి ఆత్మవిశ్వాసం జట్టుకు అందించిన భరత్‌పై కోహ్లీ తన ప్రేమను వ్యక్తపరిచాడు.
కోహ్లీ సహచర్యంతో ఎంతో మార్పు..
విరాట్ కోహ్లీ వ్యక్తిగత ప్రదర్శనకు తోడు యువ క్రికెటర్లను మోటివేట్ చేయడం అతని ప్రత్యేక బలం. చాలా సందర్భాల్లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న క్రికెటర్లతో మాట్లాడి వారి ప్రదర్శన మెరుగైయ్యే విధంగా చేశాడు. అందులో ముందు వరుసలో ఉంటాడు మియా భాయ్ సిరాజ్. గల్లీ క్రికెటర్ స్థాయి నుంచి ఐపీఎల్‌లో అదరగొట్టి టీమిండియా టెస్ట్ జట్టులో కీలక సభ్యుడిగా మారడానికి కారణం కోహ్లీనే. ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో ధారాళంగా పరుగులు ఇచ్చేవాడు ఈ హైదరాబాదీ. తర్వాత కోహ్లీ కేర్ తీసుకుని అతన్ని ఆర్సీబీ మెయిన్ బౌలర్‌గా మార్చాడు. ఆ తర్వాత సిరాజ్ నుంచి అద్భుత ప్రదర్శనలు చూశాం. టెస్ట్ మ్యాచ్‌లలో అయితే ఒక కొత్త సిరాజ్‌ను మనకు కనిపించాడు. మైదానంలోనే కాకుండా బయట కూడా కోహ్లీ సిరాజ్‌కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఒక సారి హైదరాబాద్‌లో మ్యాచ్ సందర్భంగా సిరాజ్ ఇంటి వెళ్లి వాళ్ల అమ్మ చేసిన బిర్యానిని ఇష్టంగా తిన్నాడు కోహ్లీ.
సిరాజ్ కూడా కోహ్లీని విరాట్ భాయ్ అంటూ ప్రేమ అభిమానిస్తాడు. ఇక కేఎస్ భరత్ కూడా కోహ్లీ ఇష్టమైన తెలుగు క్రికెటర్. 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న భరత్‌కు సరైనా అవకాశాలు రాలేదు. 2021లో ఆర్సీబీ భరత్‌ను వేలంలో తీసుకుంది. భరత్ ప్రతిభపై నమ్మకంతో కోహ్లీ అతన్ని వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా స్థానమిచ్చి ముందుకు నడిపించాడు. కోహ్లీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అద్భుత ప్రదర్శనలతో సిరాజ్ తర్వాత విరాట్ మనసు గెలుచుకున్న రెండో తెలుగు వాడిగా భరత్ నిలిచాడు. ఇలా తెలుగు యువ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ, వారిపై ప్రేమాభిమాలను కురిపిస్తున్నాడు కింగ్ కోహ్లీ. మరీ తెలుగు తేజాలకు అండగా ఉంటున్న కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ.. నువ్వు మనిషివా? లేక పూమా చిరుతవా?