ఐపీఎల్ వాయిదాకి కారణం ఆ ఆటగాడేనా? గంగూలీ సీరియస్!

ఎంతో అట్టహాసంగా మొదలైన ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. జట్లలో కొంత మంది ఆటగాళ్లకి కోవిడ్ పాజిటివ్ రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లన్నీ అత్యంత పటిష్టమైన బయో బబుల్ లో జరిగాయి. అయినప్పటికీ ఆటగాళ్లకి పాజిటివ్ రావడంతో తప్పు ఎక్కడ జరిగింది అనే విషయంలో బీసీసీఐ విచారణ చెప్పటింది. అయితే.., ఇప్పుడు ఈ విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటకి వచ్చాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2021లో ముందుగా పాజిటివ్ కేసు నమోదైంది కోల్‌కతా నైటరైడర్స్ డ్రెస్సింగ్ రూమ్ లో. ఆ జట్టు ప్లేయర్ వరుణ్ చక్రవర్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యాక.., మిగతా అందరికీ టెస్ట్ లు చేశారు. సో.., ఆ దిశగా విచారణ చేయగా.. వరుణ్ చేసిన తప్పు బయట పడిందట. ఐపీఎల్ మధ్యలో వరుణ్ చక్రవర్తి ఇంజ్యుర్ అయిన విషయం తెలిసిందే. దీనితో వరణ్‌ని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి అక్కడ వైద్యం అందించారు.

చికిత్య అనంతరం హోటల్ కి తిరిగి వచ్చిన వరుణ్ మాములుగా వారం రోజులు క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి ఉంది. కానీ.., ఇక్కడే కోల్‌కతా ఆటగాడు గీత దాటడట. హాస్పిటల్ నుండి హోటల్ కి వచ్చిన వరుణ్ చక్రవర్తి నేరుగా సన్ రైజర్స్ ఆటగాడు సందీప్‌ శర్మని కలిశాడు. ఆ తరువాత వరుణ్ క్వారెంటైన్ కి వెళ్ళాడు గాని.. అక్కడికే రూల్ బ్రేక్ అయిపోయింది. తరువాత ఢిల్లీ ఆటగాడు అమిత్ మిశ్రాతో సందీప్ మాట్లాడాడు. ఇక తన డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న వృద్ధిమాన్ సాహాతో క్లోజ్ గా మూవ్ అయ్యాడు సందీప్. ఇలా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంది లీగ్ వాయిదా పడటానికి కారణమైనట్టు తెలుస్తోంది. దీనితో.., బీసీసీఐ ఈ విషయంలో పూర్తి రిపోర్ట్ కోరినట్టు సమాచారం. ఒకవేళ ఈ విచారణలో కనుక వరుణ్ తప్పు చేసినట్టు తేలితే బోర్డు పెద్దలు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటాడో అన్న చర్చ మొదలయింది. ఇక ఐపీఎల్ వాయిదా వేశాక బీసీసీఐ ఛైర్మెన్ గంగూలీ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లీగ్ నిర్వహణ బయట అనుకునేంత సులభం కాదు. కానీ.., ఇలాంటి సమయంలో ప్రజలకి ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఆలోచనతో ఐపీఎల్ ని స్టార్ట్ చేశాము. కానీ.., దురదృష్టవశాత్తు లీగ్ వాయిదా పడింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తో చర్చలు జరుపుతున్నాము. అంతా అనుకున్నట్టు జరిగితే ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ కన్నా ముందే.. మిగతా ఐపీఎల్ మొదలవుతుంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే మాత్రం ఈసారి బోర్డుకి రూ.2250 కోట్ల రూపాయల నష్టం తప్పదని గంగూలీ వ్యాఖ్యానించడం విశేషం. మరి.. రానున్న కాలంలో ఐపీఎల్ 2021 భవితర్యం ఏమవుతుందో చూడాలి.