ఫస్ట్‌ మ్యాచ్‌తోనే రికార్డు సృష్టించిన RCB ప్లేయర్‌

timdavid rcb ipl2021

సింగపూర్‌ క్రికెట్‌ టీమ్‌ అనేది ఉందని భారతీయ సగటు క్రికెట్‌ అభిమానికి తెలియదు. ఎందుకంటే ఆ జట్టు ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ వన్డే, టెస్ట్‌ మ్యాచ్‌ ఆడలేదు. అలాంటి జట్టు ఆటగాడు ఏకంగా ఐపీఎల్‌ వేలంలో మంచి ధరకు అమ్ముడుపోయాడు. అది కూడా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు లాంటి పెద్ద జట్టులో సభ్యుడయ్యాడు. అంతర్జాతీయ వన్డే, టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేకుండానే ఐపీఎల్‌లో ఆడుతున్న మొట్టమొదటి ఫారెన్‌ ప్లేయర్‌గా రికార్డులెక్కాడు. అతనే నిన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ తరుఫున అరంగేట్రం చేసిన టిమ్‌ డేవిడ్‌.

timdavid rcb ipl2021

ఇతరు సింగపూర్‌ క్రికెట్‌ టీమ్‌ ప్లేయర్‌. ఆ దేశానికి ఇంకా అంతర్జాతీయ వన్డే, టెస్ట్‌ మ్యాచ్‌ ఆడే హోదా రాలేదు గానీ డేవిడ్‌ మాత్రం మంచి నైపుణ్యం ఉన్న ఆడగాడు. బిగ్‌బ్యాష్‌ లీగ్‌, కరేబియన్‌ లీగ్‌, హండ్రేడ్‌ లాంటి టోర్నీలలో సత్తా చాటాడు. ఆ లీగ్‌లలో అతని అద్భుత ప్రదర్శన చూసి ఆర్సీబీ యాజమాన్యం అతన్ని వేలంలో సొంతం చేసుకుంది. కాగా నిన్నటి మ్యాచ్‌లో మాత్రం డేవిడ్‌ నిరాశ పరిచాడు. మూడు బంతులాడి కేవలం ఒకే ఒక్క పరుగు చేసి దీపక్‌ చాహార్‌ బౌలింగ్‌లో సురేష్‌ రైనాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.