రాంచీలో రోహిత్ క్రేజ్.. రోహిత్‌ శర్మ పాదాలపై పడిన అభిమాని

rohit sharma fan

ఇండియా క్రికెట్ అంటే కేవలం ఓ ఆట మాత్రమే కాదు. దీన్ని ఓ మతంగా భావించే అభిమానులు కోట్లలో ఉన్నారు. టీమిండియా ఓడినా, గెలిచినా ఆటగాళ్లను నెత్తిన పెట్టుకుని ఆరాధించే ఫ్యాన్స్ కి ఇండియాలో కొదవ లేదు. సచిన్, గంగూలీ, ద్రావిడ్, సెహ్వాగ్, యువరాజ్, ధోని, కోహ్లీ లాంటి వారికి ఇలాంటి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే.. ప్రస్తుతం రోహిత్ శర్మకి కూడా ఈ రేంజ్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

రోహిత్ టీ 20 కెప్టెన్ గా ఎన్నిక అయ్యాక అతని ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సీరీస్ లో రోహిత్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఇదే సమయంలో కెప్టెన్ గా కూడా తన మార్క్ చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ పై తమ అభిమానాన్ని తెలియచేయడానికి ఓ అభిమాని ఏకంగా గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. న్యూజిలాండ్ తో రాంచీ వేదికగా జరిగిన రెండవ టీ-20 మ్యాచ్ ఇందుకు వేదిక అయ్యింది.

భారత్ – న్యూజిలాండ్ దేశాల మధ్య జరిగిన రెండవ టీ ట్వంటీ మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రోహిత్ శర్మ అభిమాని నేరుగా గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. పోలీస్ సెక్యూరిటీని, ప్రహరీని దాటుకుని నేరుగా మైదానంలోకి అడుగు పెట్టిన అతను తన ఆరాధ్య క్రికెటర్ టీమిండియా ట్వంటీ ట్వంటీ కెప్టెన్ రోహిత్ శర్మ వైపు మెరుపు వేగంతో పరుగు తీశాడు. దీంతో.., గ్రౌండ్ ఏమి జరుగుతుందో తెలియక అంతా టెన్షన్ కి గురయ్యారు. పరుగున రోహిత్ ని చేరుకున్న ఆ అభిమాని రోహిత్ శర్మ ముందు ఎల్లకిలా పడుకుని రెండు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయితే తనకు రోహిత్ శర్మ పాదాలు అందలేదు. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో రోహిత్ శర్మ కూడా షాక్ కి గురయ్యాడు. ఇంతలో ఓ సెక్యూరిటీ సిబ్బంది పరుగున వచ్చి, ఆ అభిమానిని బయటకి తీసుకెళ్లిపోయాడు.

నిజానికి రాంచీ అంటే ధోని సొంత రాష్ట్రం. ఇక్కడ ధోనిని అభిమానించే వారి సంఖ్య చాలా ఎక్కువ. అలాంటి రాంచీలో రోహిత్ కి ఈ రేంజ్ క్రేజ్ ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు ఈ ఘటనపై మాజీ క్రికెటర్స్ మరో కోణంలో విమ్మర్శలు సంధిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఆటగాళ్ల భద్రతని ప్రశ్నార్థకం చేస్తున్నాయని, ఇకనైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మరి.. అభిమాని రోహిత్ శర్మ కాళ్ళకి నమస్కరించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.