ఆస్ట్రేలియా డ్రెస్సింగ్‌ రూమ్‌ లో అంబరాన్ని అంటిన సంబరాలు.. వీడియో వైరల్‌

Australia Cricket Team Drink in Shoes - Suman TV

‘ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌’ విజతగా ఆస్ట్రేలియా అవతరిచింది. అద్భుతమైన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పై ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా. విజయం సాధించిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌ లో ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌(85) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ వృథా అయ్యింది. భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఎంతో సులువుగా 18.5 ఓవర్లలోనే చేరుకుంది. మిచెల్‌ మార్ష్‌ మరోసారి విజృభించాడు. వార్నర్‌(53) అద్భుత హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా డేవిడ్‌ వార్నర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ గా నిలిచాడు. అంత బాగానే ఉందిగానీ.. మాథ్యూ వేడ్‌, స్టొయినిస్‌ చేసిన ఒక పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదే.. షూలో డ్రింక్‌ తాగడం. అలా ఎందుకు చేశారు? దాని వెనకాల ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? అలాంటి ప్రశ్నలకు సమాధానం మీకోసం..

ఆస్ట్రేలియా సంప్రదాయం..

అలా షూలో డ్రింక్‌ తాగడం అనేది ఆస్ట్రేలియా సాంప్రదాయంగా మారిపోయింది. 1990ల్లోనూ క్రీడా కార్యక్రమాల్లో విజయం తర్వాత ఈ విధంగా షూలో డ్రింక్‌ తాగేవారని కొందరు ప్రస్తావించారు. 15 ఏళ్ల క్రితం ఒక సర్ఫింగ్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్‌ లో ఇలా షూలో డ్రింక్‌ తాగిన వీడియో ఒకటి బయట పడింది. అలా చేయడాన్ని ‘షూఈ’ అంటారు. అంటే వారిది లేదా ఎవరిదైనా షూ నిండా ఆల్కహాల్‌(ఎక్కువగా బీర్‌ ను ఉపయోగిస్తారు) పోసుకుని.. అది వారి చొక్కాపై పడేలా తాగుతారు. అలా తాగిన వ్యక్తి లేదా మరొకరు ఆ తడి షూను రాత్రంతా ధరించాలి. ముఖ్యంగా అభిమానులు ‘డూ ఏ షూఈ’ అని డిమాండ్‌ చేసిన సందర్భాల్లో పాప్‌ సింగర్స్‌, క్రీడా ఈవెంట్లలో ఇలా చేస్తారు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన ఎందరో సెలబ్రిటీలు ఇలా చేశారు. వారిలో ఆస్ట్రేలియా ఫార్ములా వన్‌ రేసర్‌ డేనియల్‌ రికియార్డో, సినీ తారలు సర్‌ ప్యాట్రిక్‌ స్టువర్ట్‌, గెరార్డ్‌ బట్లర్‌, జిమ్మీ ఫాల్కన్‌ అలా తాగారు. మ్యుజీషియన్స్‌ స్టోర్మ్‌ జీ, మెకైన్‌ గన్‌ కెల్లీ, అమైన్‌, లూక్‌ బ్రాన్‌, హ్యారీ స్ట్రైల్స్‌ వంటి తారలు ‘షూఈ’ చేసిన వారే. ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టొయినిస్‌, మాథ్యూ వేడ్‌ ఈ లిస్ట్‌ లో చేరారు.

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో..

ఇది కేవలం ఆస్ట్రేలియా సంప్రదాయం మాత్రమే అనలేం. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులు ఒక లెథర్‌ షూలో మద్యం పోసి దాని చుట్టూ తిరిగే వారంట. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఆ షూలో మద్యం తాగేవారు. అలా చేయడం వల్ల అదృష్టం వరిస్తుందని వారి నమ్మకం. ప్రస్తుతం వేడ్‌, స్టొయినిస్‌ షూలో డ్రింక్‌ తాగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. షూలో డ్రింక్‌ తాగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)