కోహ్లీపై బీసీసీఐకి అశ్విన్‌ ఫిర్యాదు.. వన్డే కెప్టెన్సీకి ముప్పు

This senior cricketer had complained the BCCI about Virat Kohli - Suman TV

ఒక వైపు ధూంధాంగా ఐపీఎల్‌ జరుగుతున్నా కొన్ని రోజులుగా భారత క్రికెట్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో విరాట్‌ కోహ్లీ టీ20 కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ప్రధానమైనది. దాని వెనుక కారణాలు ఇంకా తెలియనప్పటికీ బ్యాటింగ్‌పై పూర్తి దృష్టిపెట్టేందుకే కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. అక్టోబర్‌ 17 నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత కోహ్లీ టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉండడు. ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీ బ్యాటింగ్‌పై ఫోకస్‌ పెట్టేందుకే కెప్టెన్సీ వదులుకున్నట్లు చెప్తున్నా, జట్టులో అంతర్గతంగా ప్లేయర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని, కొంతమంది సీనియర్‌ ఆటగాళ్లు కోహ్లీ తీరుపై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోహ్లీ యాటిట్యూడ్‌తో చాలామంది ప్లేయర్లు ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం. దీనిపై గతంలో పలువురు సీనియర్‌ ప్లేయర్లు బీసీసీఐకి రహస్యంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. కాగా ఇదే క్రమంలో తాజాగా టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా కోహ్లీపై బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సందర్భంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోహ్లీ, అశ్విన్‌ మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై అశ్విన్‌ బీసీసీఐకి అధికారికంగా కోహ్లీ తీరుపై ఫిర్యాదు చేశాడని వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై బీసీసీఐ కానీ, అశ్విన్‌ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఒక్క టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తప్పిస్తే టెస్టుల్లో కోహ్లీ సేన అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ లాంటి బలమైన జట్లను వారి దేశంలోనే ఓడించి సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. అది అంత సామాన్యమైన విషయం కాదు.

This senior cricketer had complained the BCCI about Virat Kohli - Suman TVఅలాగే ఈ ఏడాది చివర్లో టీమిండియా సౌతాఫ్రికాతో మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా వెళ్లనుంది. ఇప్పటి వరకూ అక్కడ టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ గెలవలేదు. ఈ సారీ దాన్ని తిరగరాసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కోహ్లీ సేన టెస్టుల్లో అద్బుతప్రదర్శనను మాజీ క్రికెటర్లు, విమర్శకులు కూడా ప్రశంసించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా కెప్టెన్‌గా కోహ్లీకి ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేకపోవడం పెద్దలోటుగా కనిపిస్తుంది. దానికి తోడు సీనియర్‌ ఆటగాళ్లతో పడకపోవడంతోనే కోహ్లీ టీ20 జట్టు కెప్టెన్‌గా తప్పకునేలా చేసిందని సమాచారం.

వాస్తవానికి బీసీసీఐ కూడా కెప్టెన్‌ మార్పుపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసే కోహ్లీ ఈ విధంగా చేశాడా అని క్రికెట్‌ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అశ్విన్‌ ఫిర్యాదుపై బీసీసీఐ స్పందించి వన్డే జట్టు కెప్టెన్‌గా కూడా కోహ్లీని తప్పించే అవకాశాలు ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. దానికి కారణం 2023 వన్డే వరల్డ్‌ కప్‌కు ఇండియా అతిథ్య ఇవ్వనుంది. 2023 వరల్డ్‌ కప్‌ సాధించేందుకు అవసరమైన ప్రణాళికల్లో భాగంగా బీసీసీఐ కెప్టెన్‌ మార్పుపై కూడా ఆలోచించనున్నట్లు తెలుస్తుంది. కోహ్లీపై అశ్విన్‌ ఫిర్యాదుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ టీమిండియా జట్టు ఇదే!