ఐపీల్ 2022 సీజన్ ఫుల్ జోష్ తో కొనసాగుతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. భారీ లక్ష్యాలు నమోదు చేయడమే కాదు.. వాటిని ఛేదించి ఔరా అనిపిస్తున్నారు. అసలు ఐపీఎల్ అంటేనే న్యూ టాలెంట్ హంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఐపీఎల్ వల్ల ఎందరో గొప్ప ప్లేయర్లు క్రికెట్ ప్రపంచానికి, టీమిండియాకు పరిచయం అయ్యారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఆ జాబితాలోకి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన ఓ యంగ్ ప్లేయర్ పేరు మాత్రం అతి త్వరలో చేరుతుందని రవిశాస్త్రి ఆకాంక్షింస్తున్నాడు.
ఇదీ చదవండి: ఒక వ్యక్తిని ఇంతలా అభిమానిస్తారా? ఆర్సీబీ మ్యాచ్ లో CSK ఫ్యాన్స్ రచ్చ
అతను మరెవరో కాదు.. సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్. సునాయాసంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బాల్ ను సంధించగలడు. గత సీజన్ చివరిలో ఉమ్రాన్ మాలిక్ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హైదరాబాద్ టీమ్ యాజమాన్యానికి సోషల్ మీడియానే కాదు.. మాజీలు సైతం చురకలు అంటించారు. ఇంత టాలెంట్ ఉన్న బౌలర్ ను ఇంతకాలం ఎందుకు పరిచయం చేయలేదని ప్రశ్నించారు. ఈ సీజన్ లో మాత్రం ఉమ్రాన్ రూ.4 కోట్లతో రిటైన్ చేసుకుని మొదటి మ్యాచ్ నుంచి అవకాశం కల్పిస్తున్నారు.జట్టు అవకాశం కల్పించిన విధంగానే మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ ఆటగాళ్లను ఉమ్రాన్ కాస్త ఇబ్బంది పెట్టగలిగాడు. నాలుగు ఓవర్లలో 39 పరుగులు ఇచ్చినా కూడా.. రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకుని అభిమానులను ఆకట్టుకున్నాడు. జోస్ బట్లర్, పడిక్కల్ వంటి విధ్వంసకర బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. ఆ టాలెంట్ చూసే.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం హిందీ కామెంటేటర్ గా ఉన్న రవిశాస్త్రి.. రాజస్థాన్ vs హైదరాబాద్ మ్యాచ్ లో రవిశాస్త్రి కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న సమయంలో ప్రస్తావించాడు. ‘ఉమ్రాన్ మాలిక్ అతి త్వరలోనే టీమిండియాలో చోటు దక్కించుకుంటాడు. అతను సరైన ఏరియాలో బాలింగ్ చేస్తే ఎంతో మంది బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు. సెలక్టర్లు అతడిని క్లోజ్ గా గమనిస్తుండాలి’ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రవిశాస్త్రి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రవిశాస్త్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.