టీమ్ ఇండియాపై పాక్ మాజీ ఆటగాడు అబ్దుల్ రజాక్ సంచలన వ్యాఖ్యలు

team india

టీమ్ ఇండియాపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు అబ్దుల్ రజాక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పాకిస్తాన్ టీమ్ ముందు భారత క్రికెట్ టీమ్ పనికిరాదంటూ, మీ పరువును కాపాడుకోవాలంటే పాకిస్తాన్ టీమ్ తో భవిష్యత్ లో ఆడకపోవటమే మేలంటూ విచిత్రమైన సలహాలు ఇస్తూ అందరి పెదవులపై నవ్వులు పూయిస్తున్నాడు. ఇక మరో వారంలో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ను ఉద్దేశించి అబ్దుల్ రజాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని తేటతెల్లమవుతోంది. అయితే ఈ వ్యాఖ్యలే కాకుండా ఇప్పుడున్న కోహ్లీ కెప్టెన్సీలో ఉన్న టీం ఇండియా మీరనుకుంటున్నట్లు బలమైన టీం ఏం కాదని అభిప్రాయపడ్డారు.

ఇక ఇండియా మహా అంటే సునిల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, జస్ప్రిత్ బుమ్రా వంటి ఆటగాళ్లు ఉన్నా.. మా పాకిస్తాన్ టీం ముందు దిగదుడుపే అంటూ వ్యంగ్యంగ స్పందించారు. ఇక భారత టీం ఎప్పుడు తీవ్రమైన ఒత్తిడితో ఉంటుందని, అందుకే రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో ఆడకపోవటమే బెటర్ అంటూ ఉచిత సలహాలు ఇస్తూ నవ్వుల పాలవుతున్నాడు. ఇక పాక్ మాజీ ఆటగాడు అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్స్ ఆయనకు చురకలు అంటిస్తున్నారు.

team indiaరజాక్ బాయ్.. ఓ సారి చరిత్రలోకి వెళ్లి చూడు. విక్టరీ అంటే మాది. ఇప్పటి వరకు పాకిస్తాన్ తో భారత్ టీమ్ తలపడిన ప్రతీ మ్యాచ్ లో ఇండియా గెలుపులే అధికమని గుర్తు చేశారు. ఇక భారత్‌ చేతిలో పాకిస్తాన్ 14 సార్లు ఓడిపోయి చెత్త రికార్డును ఓ సారి తొంగి చూడాలని, 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్ లో పాక్ ని చిత్తు చేసి కప్ గెలుచుకున్న చరిత్రను మరిచావా? అంటూ నెటిజన్స్ అబ్దుల్ రజాక్ ను ప్రశ్నల వర్షం తడిపేస్తున్నారు. టీమ్ ఇండియాపై పాక్ ఆటగాడు అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.