పాకిస్తాన్‌ ఓపెనర్‌ కు వైద్యం చేసింది మన భారతీయుడే..

rizwan

‘ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌’లో పాకిస్తాన్‌ కథ ముగిసింది. సెమీస్‌-2లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. హోరాహోరీ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌ చేరింది. రిజ్వాన్‌(52 బంతుల్లో 67) ఓపినింగ్‌లో వచ్చి 17.2 ఓవర్ల వరకు నిలబడి పాకిస్తాన్‌ భారీ స్కోర్‌ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అతను అంతసేపు క్రీజులో ఉండి ఆడగలిగాడా అని అందరూ ఆశ్చర్యపోయారు. అంత తీవ్రంగా ఉన్న చెస్ట్‌ ఇన్‌ ఫెక్షన్‌ను తగ్గడానికి వైద్యం చేసిన వైద్యుడు భారతీయుడే. భారత్‌కు చెందిన సహీర్‌ సైనలబ్దీన్‌.. రిజ్వాన్‌ చికిత్స అందించాడు. అందుకు మ్యాచ్‌ అనంతరం రిజ్వాన్‌ వెళ్లి కృతజ్ఞతలు తెలిపిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

rizwanకృతజ్ఞతగా బహుమతి..

ఆస్ట్రేలియాపై కీలక సెమీస్‌ లో మహ్మద్‌ రిజ్వాన్‌ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. 52 బంతుల్లో 67 పరుగులు సాధించిన రిజ్వాన్‌ అందరి మన్ననలు పొందాడు. ఆ మ్యాచ్‌ కు ముందు రెండ్రోజులు రిజ్వాన్‌ చెస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ తో ఐసీయూలో ఉన్న విషయం తెలిసిందే. అతడికి మంచిగా వైద్యం చేసిన వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు రిజ్వాన్‌ మళ్లీ ఆస్పత్రికి వెళ్లాడు. అతడు ఆ రోజు మ్యాచ్‌ ఆడిన జెర్సీని వైద్యుడు సహీర్‌ సైనలబ్దీన్‌కు అందజేశాడు. తనకు అంత తర్వగా క్యూర్‌ అయ్యేలా చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. పాకిస్తాన్‌ హెడ్‌ కోచ్‌ హేడెన్‌ సైతం రిజ్వాన్‌ వారియర్‌ అంటూ ప్రశంసించిన విషయం తెలిసిందే.