ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో గెలిచింది. కాగా ఈ మ్యాచ్‌తో ఆరేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబ్ బౌలర్ రిషి ధావన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. 2016లో పంజాబ్ తరఫున చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రిషి ధావన్ ఇన్నాళ్లకు మళ్లీ అవకాశం అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రిషి ధావన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ బౌలింగ్‌లో అదరగొట్టాడు. అయితే హెడ్ మాస్క్ లాంటి సెఫ్టీ షీల్డ్ ధరించి రిషి ధావన్ బౌలింగ్ చేయడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన ఫోటోస్ ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవలే గాయం నుంచి కోలుకొని, ముక్కుకు సర్జరీ చేయించుకొని వచ్చిన రిషి ధావన్.. బ్యాటర్ కొట్టే షాట్స్ తగిలినా ఏం కాకూడదు అనే ఉద్దేశంతో ఈ హెడ్ మాస్క్‌ను ధరించాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన రిషి ధావన్ సెకండాఫ్ టోర్నీలో తీవ్రంగా గాయపడ్డాడు. బ్యాటర్ కొట్టిన షాట్ నేరుగా అతని ముక్కుకు తగలడంతో ఆసుపత్రిపాలయ్యాడు. వైద్యులు అతని ముక్కుకు సర్జరీ చేశారు. ఈ సర్జరీ కారణంగానే రిషి ధావన్ ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
ఈ మ్యాచ్‌కు ముందే పంజాబ్ జట్టుకు అందుబాటులోకి వచ్చిన అతను.. నెట్స్‌లో కూడా హెడ్ మాస్క్ ధరించే బౌలింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను పంజాబ్ కింగ్స్ ట్వీట్ చేసింది. ఈ వీడియోలో తన గైర్హాజరీకి గల కారణాన్ని రిషి ధావన్ వెల్లడించాడు. గ్లాస్ లాంటి దానితో తయారు చేసిన ఈ హెడ్ మాస్క్ తల, ముక్కు వంటి భాగాలను కవర్ చేస్తోంది. అయితే భారత్‌లో ఒక బౌలర్ హెడ్ మాస్క్ వాడటం ఇదే తొలి సారి. కానీ.. వేరే దేశాల్లో ఇటువంటి మాస్క్‌లతో పలువురు ఆటగాళ్లు బౌలింగ్ చేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రికార్డుల మోతమోగించిన శిఖర్ ధావన్! రోహిత్ రికార్డు బద్దలు
Rishi Dhawan is the man of firsts. He is the first bowler to be wearing a protective mask in #IPL. As @venkatatweets shared he was hit on head in follow through during Ranji Trophy. It should become a normal now since I’ve seen a lot of bowlers getting hit in the follow through pic.twitter.com/jPDZLJdu07
— Mohsin Kamal (@64MohsinKamal) April 25, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.