భారతదేశం అంటే పాకిస్థాన్ కు ఎక్కడలేని అసుయా పుట్టుకోస్తుంది. భారత్ ను విమర్శించడమే నిత్యం పనిగా పెట్టుకుంటా అక్కడి అధికారులు, నాయకులు. వాళ్లే అట్లే ఉంటే అక్కడి క్రికెటర్లు సైతం అదే ధోరణిలోఉంటారు. నిత్యం టీమిండియాపై, టీమిండియా ప్లేయర్లపై విమర్శులు చేస్తుంటారు. అలా విమర్శలు చేసే క్రమంలో కొన్ని సార్లు వాళ్లు నవ్వులపాలవుతారు. తాజాగా పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ రషీద్ లతీఫ్ టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ జట్టు కంటే పాకిస్థాన్ మెరుగైన జట్టు అని అన్నాడు. భారత్ మంచి జట్టు అంటూనే పాకిస్థాన్ అంత గొప్ప జట్టు మాత్రం కాదని వంకర మాటలు మాట్లాడుతున్నాడు. లతీఫ్ మాట్లాడుతూ.." టీమిండియా మంచి జట్టు అనడంలో ఎలాంటి సందేహంలేదు. కానీ ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు అత్యద్భుతమైన ప్రదర్శన చేస్తుంది. పాకిస్థాన్ లో షాహీన్ ఆఫ్రిది, బాబర్ ఆజమ్, రిజ్వాన్ వంటి మేటి ఆటగాళ్లున్నారు. ఇటీవల ఐసీసీ ప్రకటించిన టీ-20 ర్యాంకింగ్స్ వారు అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్, భారత్ తో తలపడింది. అప్పుడు టీమిండియాపై 10వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. అందువల్ల త్వరల్లో శ్రీలంకలో ప్రారంభం కానున్న ఆసియా కప్ లో విజేతగా నిలిచే అవకాశాలు పాకిస్థాన్ కే ఎక్కువ ఉన్నాయి. ఈ ఆసియా కప్ లో ప్రధాన పోటీ ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉంటుంది" అని వ్యాఖ్యనించాడు. ఇప్పటి వరకు టీ-20లలో భారత్, పాకిస్తాన్లు తొమ్మిది సార్లు తలపడ్డాయి. వీటిలో భారత్ 7 సార్లు గెలవగా, పాకిస్తాన్ మిగిలిన రెండు మ్యాచ్లలో గెలిచింది. అక్టోబర్ 23న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరగనున్న టీ20 ప్రపంచకప్లో ఇరు జట్లు లీగ్ దశలో తలపడబోతున్నాయి. మరి..టీమిండియాపై పాక్ మాజీ క్రికెట్ రషీద్ లతీఫ్ చేసిన వ్యాఖ్యలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Kapil Dev: కోహ్లీ బ్యాటింగ్ పై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!