CSK జెర్సీ ధరించేందుకు మా ఆవిడ ఒప్పుకోట్లేదు

My wife did not allow me to Wear My CSK Jersey - Suman TV

ఐపీఎల్‌లో 8 జట్లు ఉంటే అందులో కొన్ని జట్లకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందులో చైన్నె సూపర్‌ కింగ్స్‌ ఒకటి. తన అభిమాన జట్టు జెర్సీని ధరించి టీం సభ్యులలా ఫీల్‌ అయి ఆనందరపడుతుంటారు క్రికెట్‌ అభిమానులు. మ్యాచ్‌ జరుగుతున్న సందర్భంలో వివిధ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ అభిమానం చాటుకుంటూ కొందరూ హైలెట్‌ అవుతారు. అలాంటి సంఘటనే శుక్రవారం జరిగిన ఆర్సీబీ వర్సెస్‌ సీఎస్‌కే మ్యాచ్‌లో చోటు చేసుకుంది.

My wife did not allow me to Wear My CSK Jersey - Suman TVఅతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీ ధరించాడు. అతని చేతిలో ఉన్న ప్లకార్డుపై ఒకటి రాసి ఉంది. అదేమిటంటే.. ‘నా భార్య నా సీఎస్కే జెర్సీ ధరించడానికి అనుమతించలేదని’రాసి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ట్వీట్టర్‎కు ఈ ఫొటోను పోస్టు చేసింది. ‘Love Is colour Blind’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‎కు ట్విట్టర్‎లో 17,000 లైకులు వచ్చాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‎లో ధోని సేన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఛేధనకు దిగిన చెన్నై 11 బాల్స్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేధించింది.